YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

సరికొత్త ఫీచర్లతో టూ వీలర్స్ బరిలోకి "జావా"..!!

సరికొత్త ఫీచర్లతో టూ వీలర్స్ బరిలోకి "జావా"..!!

రయ్.. రయ్ అంటూ జావా మళ్ళి వచ్చేసింది. 300-400 సీసీ విభాగంలో అసలైన పోటీ మొదలయింది. రోజువారీ అవసరాలకే కాదు.. టూరింగుని  ఇష్టపడే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ సెగ్మెంట్ లో బైకులు కొనడానికి ఇష్టపడతారు. చిన్న, పెద్ద అని వయసుల వారుంటారు. ఈ కేటగిరి లో  ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ లీడర్ గా ఉంది. కానీ పాత రోజుల్లో బాగా పాపులరైన జావా మరిన్ని ఫీచర్లతో సరికొత్తగా రావడంతో పోటీ మొదలవబోతుంది. కొత్త జావా 300 సీసీ లోనే శక్తివంతమైన 27 బి ఎచ్ పి ఇంజిన్ తో వస్తుంది. వీటన్నిటి దృష్ట్యా వినియోగదారులకు  ఇది మంచి ఆప్షన్.

జావా
ఇంజిన్: 293 సీసీ, సింగిల్ సీలిండర్,6 స్పీడ్ లిక్విడ్ కూల్ 27 బి ఎచ్ పి  సామర్ధ్యం..
ఫీచర్లు: వేగంలో రక్షణ ఉండేలా సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం ఉంది. కిక్ స్టార్టుతో పాటు సెల్ఫ్ స్టార్ట్ ఉంది.  డిస్క్ బ్రేక్ లు, అనలాగ్ స్పీడో మీటర్, హాలోజన్ హెడ్ ల్యంప్లు ఆకర్షణ.
ఇంధన నిల్వ కెపాసిటీ: 14 లీటర్లు
మైలేజ్: 40 కిమీ/లి
అత్యధిక వేగం: 130 కిమిలు/గం

 

Related Posts