YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మొండి బకాయిలను వసూలు చేయడానికి ఒక అడుగు ముందుకేసిన ఆంధ్రాబ్యాంకు..!!

 మొండి బకాయిలను వసూలు చేయడానికి ఒక అడుగు ముందుకేసిన ఆంధ్రాబ్యాంకు..!!

 మొండి బకాయిలను వాసులు చేయడానికి  ఆంధ్రాబ్యాంకు ఒక అడుగు ముందుకేసింది. పునర్ వ్యవస్థీకర్మలో భాగంగా 53 ఖాతాలు సంబంధించి రూ. 1,533 కోట్లు ఆస్తులను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం బిడ్లను ఆహ్వానించింది బ్యాంక్. కొనుగోలు చేయాలనుకునేవారు ఈ నెల 30లోగా బిడ్లను సమర్పించాల్సి ఉంటుందని ఆంధ్రాబ్యాంకు ప్రతినిధి తెలిపారు. ఆంధ్రాబ్యాంకుకు ఉన్న మొండి బకాయిల్లో కార్పొరేట్ పవర్ లిమిటెడ్ రూ.125.95 కోట్లు(మొత్తం రూ.306.65 కోట్లు కాగా), విసా స్టీల్ లిమిటెడ్ రూ.128.71 కోట్లు(మొత్తం రూ.211.76 కోట్లు), తుల్సియాన్ ఎన్‌ఈసీ రూ.106.44 కోట్లు(మొత్తం రూ.154.15 కోట్లు), కార్పొరేట్ ఇస్పాత్ అల్లోయస్ లిమిటెడ్ రూ.65.06 కోట్లు(మొత్తం రూ.147.86 కోట్లు) వీటితోపాటు దిండిగల్-తేనీ-కుమిలి టోల్ వే రూ.127.57 కోట్లు బకాయి పడింది. మొత్తం రూ.146.73 కోట్లుగా ఉన్నది. కృష్ణగిరి తిండివనం జాతీయ రహదారి ప్రైవేట్ లిమిటెడ్ రూ.68.94 కోట్లు(మొత్తం రూ.102.72 కోట్లు), బరాసత్ కృష్ణాగర్ ఎక్స్‌ప్రెస్‌వేస్ రూ.106.41 కోట్లు(రూ.128.66 కోట్లు), ఐఎస్‌ఎంటీ లిమిటెడ్ రూ.85.74 కోట్లు(రూ.136.33 కోట్లు) బకాయి పడ్డాయి. ఈ బిడ్డింగ్ వచ్చే నెల 3న తెరువనున్నారు.

Related Posts