YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

2019 జనవరి 1 నుంచి కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు

2019 జనవరి 1 నుంచి కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు
డెబిట్‌, క్రెడిట్’ కార్డులు పర్స్ లో వుంటే చాలు నగదును వెంట తీసుకెళ్లాల్సిన పనిలేకుండా నగదు అవసరాలు తీరిపోయేవి. ఇది వినియోగదారులకు సౌకర్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇకపై ఈ  ‘డెబిట్‌, క్రెడిట్’ కార్డులు చెల్లవంటు ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. డిసెంబర్‌ 31 తర్వాత పాత డెబిట్‌, క్రెడిట్ కార్డులు చెల్లవని ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఖాతాదారులు వెంటనే తమ వద్ద ఉన్న డెబిట్, కార్డులను మార్చుకోవాల్సిందిగా బ్యాంకులు ఖాతాదారులను కోరుతున్నాయి. లేని పక్షంలో 2019 జనవరి 1 నుంచి ఆ పాత కార్డులు పనిచేయవని తెలిజేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా   ఖాతాదారులు పాత 'మాగ్నెటిక్ స్ట్రిప్' ఉన్న కార్డుల స్థానంలో కొత్తగా ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలి. ఈ కొత్త ఈఎంవీ కార్డులు ఖాతాదారులకు భద్రతనివ్వటంతో పాటు మోసాల బారిన పడకుండా అడ్డుకుంటాయని బ్యాంకులు తెలిజేస్తున్నాయి. దీంతో 2015, ఆగస్ట్ 27న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు పాత కార్డులను రీప్లేస్ చేయాల్సిందిగా ఆదేశించింది.  సెప్టెంబర్ 1, 2015 నుంచే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలువుతుందని కూడా ఆర్బీఐ ప్రకటించింది. మీ పాత కార్డులను ఇంకా మార్చుకోకపోతే రెండు రకాలుగా మార్చుకునే వీలుంటుంది. మీకు  సంబంధించిన బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లి ఈ-సర్వీసెస్‌లో ఏటీఎం కార్డ్ సర్వీసెస్‌లోని రిక్వెస్ట్ ఏటీఎం, డెబిట్ కార్డ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్ గా మీ బ్యాంక్ ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి మార్చుకోవాల్సి ఉంటుంది. 

Related Posts