YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

'బాబు' ఉచ్చులో హరికృష్ణ కుటుంబం

'బాబు' ఉచ్చులో హరికృష్ణ కుటుంబం

 విశ్లేషకులు:
ఎన్. సీతాపతి రావు.
యువ్ న్యూస్, గుంటూరు.

 కూరలో కరివేపాకు మాదిరిగా తమ, పర అనే బేధం లేకుండ, తన స్వార్ధం కోసం ఎవరినైనా వినియోగించుకొని, వదిలి వేయడంలో 'నారా' వారికీ సాటి మరెవ్వరు రారు. తన రాజకీయ అవసరాల కోసం దివంగతులను వాడుకోవడం చంద్రబాబుకి వెన్నుతో పెట్టిన విద్య. బాబుకు మొదటినుంచి తనతో ఉన్న వారిని అవసరం తీరిన అథః పాతాళానికి తొక్కివేయడం అలవాటు. జీవించి ఉన్నపుడు, దివంగతుడు అయినా తరువాత కూడా చంద్రబాబు తన బావమరిది నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని  'బకరా' చేయడం మానుకోలేదు.
    1995 లో ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి అయినా  సమయంలో  చంద్రబాబునాయుడు తన బావమరిది హరికృష్ణ మద్దతు తీసుకున్నారు. ఆవేశం ఎక్కువ, కుళ్ళు, కుతంత్రకాలు తెలియని హరికృష్ణ 'నారా' వారి ఉచ్చులో పడి, తన తండ్రిని వెనుపొట్టు పొడవడానికి తన బావకు సహకరించడు.  చంద్రబాబు తన మంత్రి వర్గంలో హరికృష్ణకు రవాణాశాఖ మంత్రిగా స్థానం కలిపించారు. అప్పటికి అయన శాసనసభ్యుడు కాదు, శాసనసభ్యుడు కానీ వారు మంత్రి పదవి చేపడితే ఆరు నెలలు లోపు శాసనసభ్యునిగా ఎన్నికవ్వాలి. హరికృష్ణ శాసనసభ్యునిగా ఎన్నికవడానికి చంద్రబాబు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో పార్టీ ఫై పట్టు బిగించి, హరికృష్ణను పటించుకోవడం మానివేశారు.
   అనంతరం, హిందూపురంలో జరిగిన ఉప ఎన్నికలలో హరికృష్ణ గెలుపొందిన, ఆయనకు మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. తనను తన బావ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన హరికృష్ణ తన 'ఆహ్వానం' హోటల్ కె పరిమితమయ్యారు.
   2004 ఎన్నికలలో చిత్తుగా ఓడిన చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబం అండ లేకుండ, తన చరిష్మాతో ఎన్నికలు గెలవడం సాధ్యంకాదని గుర్తించారు. దీంతో, హరికృష్ణను 2008 లో రాజ్యసభకు పంపారు. అయినప్పటికీ 2014 ఎన్నికలలో బాబుకు విజయం దక్కలేదు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించక పోవడంతో హరికృష్ణ అప్పుడప్పుడు అలక వహిస్తుండడం, తన రాజకీయ చతురతో చంద్రబాబు ఆయన్ని బుజ్జగించడం మామూలైపోయింది. అనంతరం, హరికృష్ణ ఆంధ్రప్రదేశ్ విభజనకు నిరసనగా 2013 లో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఎన్టీఆర్ కుటుంబం మద్దతు లేకుంటే తనకు కష్టమనే ఉద్దేశంతో, పార్టీ ఫొల్లెట్ బ్యూరోలో కొనసాగించారు.
  కొద్దీ నెలలు క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దివంగతులయ్యారు. అయితే, పార్టీ పరంగా హరికృష్ణకు సంబంధించి సంతాపసభలు మొక్కుబడిగా నిర్వహించారు. ఇటీవలకాలంలో చోటామోటా నాయకులూ మరణించిన విగ్రహాలు పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకనేతగా కొనసాగిన హరికృష్ణ విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు ఎటువంటి చొరవ చూపకపోవడం గమనార్హం.
         తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తెరిగి జవస్థత్వాలు కలిపించడం కోసం చంద్రబాబు చరిష్మా చాలదని విషయం అర్ధం అయింది. అందుకని, సెటిలర్ల ఓట్లను గంపగుత్తగా పొందటం కోసం హరికృష్ణ కుమార్తె సుహాసిని వద్దకు రాయబారాలు పంపి, ఆమె కూకట్ పల్లి నుంచి పోటీ చేసే విధంగా ఒప్పించారు. అటు పార్టీ, ఎన్టీఆర్ కుటుంబం తో జూనియర్ ఎన్టీఆర్ మధ్య సంబంధాలు హరికృష్ణ మరణం తరువాత మెరుగు అయ్యాయి. దీనితో జూనియర్ ఎన్టీఆర్ తప్పనిసరి ఎన్నికల ప్రచారానికి రావాల్సి వచ్చింది.
 హరికృష్ణ సమాధి కట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. అదే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో హరికృష్ణ స్మారకం నిర్మించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ లో ఉన్న సెటిలర్ల ఓట్లను దండుకోవడం ద్వారా లబ్ధిపొందాలనే కూకట్ పల్లి నుంచి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ దించారనే విషయం తేటతెల్లం అవుతుంది. సుహాసినిని పోటీ చేయించడం ద్వారా తలలు పండిన రాజకీయనాయకులు సైతం ఔరా చంద్రబాబు అంటూ ముక్కున వేలేసుకొంటున్నారు. మొత్తం మీద హరికృష్ణ కుటుంబం మరోసారి చంద్రబాబు ఉచ్చులో పడింది అనడంలో సందేహం లేదు.

Related Posts