YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

అసెంబ్లీ పోరులో మెరిసేది ఎవరు?

అసెంబ్లీ పోరులో మెరిసేది ఎవరు?
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం...  ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ సమరానికి ముందు జరుగుతున్న అసలు సిసలు సెమీఫైనల్స్‌ కావడంతోనే ఈ ఇంట్రెస్ట్. 2019 సార్వత్రిక ఎన్నికల నాడిని ఇవి తెలియచెబుతాయి కాబట్టే ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలోని 5 కీలక రాష్ట్రాల్లో ఓటర్ల మనోగతాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికలు బయట పెడతాయి. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో ఓటర్ల మనఃస్థితినీ ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 83 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఎన్నికలే అయినా జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణలో ఆరునూరైనా అధికారం తమదే అంటోంది టీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ కూడా తామే పవర్ చేజిక్కించుకుంటామని చెప్తోంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే.. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే ప్రధాన పోటీ. దీంతో ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీల పర్ఫార్మెన్స్ పై ఆసక్తి నెలకొంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పుంజుకుని 2019 సార్వత్రిక ఎన్నికలకు గ్రాండ్ గా బరిలో దిగాలన్నది బీజేపీ, కాంగ్రెస్ ల ప్లాన్. దీంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇరు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. రాజస్థాన్ లో బీజేపీ వ్యతిరేక పవనాలు ఉన్నా.. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ వెనకబడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ బీజేపీయే అధికారంలోకి రావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ లోనూ ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో 200లకు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ అంటోంది. నాలుగోసారీ తమదే విజయమని ధీమా వ్యక్తంచేస్తోంది. ఇక కాంగ్రెస్ అయితే 130కి పైగా సీట్లు సాధిస్తామంటోంది. బీజేపీ విజయపరంపరకు చెక్ పెడతామని తేల్చి చెప్తోంది. చత్తీస్ గడ్, మిజోరంల్లోనూ ఇదే సిట్యువేషన్. స్థానిక పార్టీలు గట్టిపోటీయే ఇస్తున్నా.. కాంగ్రెస్, బీజేపీలే తలపడుతున్న పరిస్థితి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ పార్టీల సత్తాకు పరీక్షగా మారినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts