YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

నేలమట్టమైంది టోంగా పార్లమెంట్

 నేలమట్టమైంది టోంగా పార్లమెంట్

-  ‘గీతా’ తుపాను ప్రభావం

- అర్ధరాత్రి విరుచుకుపడింది

-  ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధి గ్రాహమ్ కెన్నా వెల్లడి 

అర్ధరాత్రి విరుచుకుపడిన ‘గీతా’ తుపాను ప్రభావంతో పసిఫిక్ ద్వీపదేశమైన టోంగాలో పార్లమెంటు నేలమట్ట మైంది. పలు భవనాలు శిథిలాలుగా మారాయి. అనేక ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ప్ర భావంతో ఈ ద్వీపం మొత్తం అతలాకుతలమైంది. చాలామంది ప్రజ లు గాయపడ్డారని, కొందరు తీవ్రంగా గాయపడ్డారని వారి పరిస్థితి వి షమంగా ఉందని టోంగా జాతీయ అత్యవసర నిర్వహణ కార్యాలయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధి గ్రాహమ్ కెన్నా తెలిపారు. ఇది నాలుగో కేటగిరీ తుపాను అని, అందువల్ల గాలుత తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి చూస్తే రాజధాని నగరంలోని పార్లమెంటు భవనం పూర్తిగా శిథఙలమైం ది. విపరీతంగా వరదలు రావడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఎక్కడికక్కడ భవనాలు కూలిపోయి శిథిలాలు చుట్టుపక్కల పడటంతో లోపలి నుంచి బయటకు, బయటి నుంచి లోపలకు వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదు. గీతా తుపాను వల్ల కలిగిన నష్టం ఎం తో ఇంకా అంచనా వేస్తున్నామని, అత్యవసరంగా ఇక్కడ సాయం మా త్రం కావాలని న్యూజిలాండ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ తెలిపారు. దాదాపు 5,700 మందిని సహాయ శిబిరాలకు తర లించాల్సి ఉందని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అం టున్నారు. తక్షణ సాయంగా న్యూజిలాండ్ దాదాపు రూ. 3.5 కోట్లు విడుదల చేసింది. సహాయ సామగ్రితో ఆ దేశ వైమానిక దళానికి చెంది న హెర్య్యులస్ విమానం బయల్దేరుతోంది. ఆస్ట్రేలియా కూడా అత్యవ సర సాయం కోసం రూ. 1.75 కోట్ల విలువైన సామగ్రి పంపుతోంది.

Related Posts