YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

జగన్ పాదయాత్రలో అపశృతి

జగన్ పాదయాత్రలో  అపశృతి

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో చిన్నిపాటి అపశృతి దొర్లింది. నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర తెల్లపాడు క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే... తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. ఆ బాణసంచా కాస్తా రోడ్డు పక్కనే ఉన్న పొదలు, ఎండుగడ్డిపై పడటంతో... అక్కడ మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగ అలముకుంది. ఆ మంటలను దాటి ముందుకు సాగడానికి పాదయాత్రకు ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు జగన్ ను సురక్షితంగా మంటలు వ్యాపించిన ప్రదేశం నుంచి దాటించారు. అనంతరం వైసీసీ నేతలు మంటలను ఆర్పివేశారు.

Related Posts