YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సోలార్ టెక్నాలజీలో శిక్షణ

సోలార్ టెక్నాలజీలో శిక్షణ
సోలార్ ఎనర్జీ టెక్నాలజీలో 3 నెలల శిక్షణ కొరకు గ్రీన్ ఊర్జా టెక్నాలజీస్ సిస్టమ్స్ వారు నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానించుతున్నారు. ఈ శిక్షణ 3 నెలల వ్యవధితో హెచ్.ఎమ్.కె.యస్.&.యం.జి.యస్. కళాశాల, కనగాల, గుంటూరులో ఉంటుంది. శిక్షణ అనంతరం ఖాళీలను బట్టి సోలార్, ఇ.పి.సి. కంపెనీలలో ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి అర్హత పొందుతారు. శిక్షణ కాలానికి ఎలాంటి స్టేఫండ్ ఇవ్వరు గాని భోజనం,వసతి ఉచితంగా ఉంటుంది. శిక్షణ కొరకు ధరఖాస్తు చేయబోవు అభ్యర్ధుల కనిష్ఠ వయస్సు 18 సం-రాలు , గరిష్ట వయస్సు 36 సం-రాలు ఉండాలి. ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/వైర్ మన్ ట్రేడ్ లలో ఐ.టి.ఐ కాని డిప్లొమా కాని ఉత్తీర్ణులై ఉండాలి.  సర్టిఫైడ్ ఎలక్ట్రీషీయన్ గా అనుభవజ్ఞలు కూడా అర్హలే. కానీ బి.టెక్, ఆపైన చదివినవారు.అనర్హులు. ప్రతి బ్యాచ్ కు 30 మంది చొప్పున శిక్షణ ఇస్తారు. జనరల్ బయోడేటాలో పూర్తి చేసిన దరఖస్తులను సర్టిఫికెట్లు ఫోటోలను జతపరచి ఆఫ్ లైన్ లో గ్రీన్ ఊర్జా టెక్నాలజీస్ సిస్టమ్స కెరాఫ్ టి.యల్. శంకర్, ఐ.ఎ.యస్. అడ్మిడనిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, రాజ్ భవన్ రోడ్డు, బెల్లావిస్తా, హైదరాబాద్ 500082 వారికి పంపాలి.   మరిన్ని వివరాలకు  సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :040-66534277. 

Related Posts