YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఎన్నికల్లో కీలకం కానున్న సోషల్ మీడియా

ఎన్నికల్లో కీలకం కానున్న సోషల్ మీడియా
రానున్న సాధారణ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది? ఈ బేతాళ ప్రశ్నకు ఠపీమని రాజకీయ విశ్లేషకులు సమాధానం చెప్పేస్తున్నారు. సామాజిక మాధ్యమాన్ని అత్యధికంగా వినియోగించుకుని ఓటర్లను ప్రబావితం చేయగలిగిన వారే విజయం సాధిస్తారన్నది ఆ సమాధానంలోని సారాంశం.మనదేశంలో ఇప్పటి వరకు నమోదైన ఓటర్ల సంఖ్య 900 మిలియన్లు కాగా వీరిలో కనీసం సగం బిలియన్ మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. ట్విట్టర్‌ను నిత్యం మిలియన్లకొద్దీ భారతీయులు వినియోగిస్తుండటంతో.. రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా, డేటా అనలిటిక్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక 2014 ఎన్నికల్లో కమలనాథులు అనుసరించిన వ్యూహం కూడా సరిగ్గా ఇదే.  తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్లో నుంచి ట్వీట్ల వరదను కొనసాగించిన మోదీ, బీజేపీ ఫేస్ బుక్ అకౌంట్లో గ్రామాల్లో మోదీ సంద ర్శించి న చిత్రమాలికను బాగా హైలైట్ చేసింది.  ఇదంతా మోదీకి మంచి పొలిటికల్ మైలేజ్ వచ్చేలా.. సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.  బీజేపీ(మోదీ)తో పోలీస్తే ఈవిషయంలో కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడి ఉంది.  దీన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ కాస్త ఆలస్యంగా మేలుకున్నా పరుగు లు పెట్టే పనిలో సాఫ్ట్‌వేర్ నిపుణుల సేవలు విస్తృతంగా వినియోగిస్తోంది. ఇందుకు యువకులపై ఎక్కువగా ఆధారపడుతోంది. రాహుల్ గాంధీ ట్విట్టర్‌లోకి 2015లో వచ్చి చేరగా ఈలోగా కమల నాథులు ఇక్కడ గట్టిగా పాగా వేశారు. ‘‘అప్పట్లో మాకేం తెలీదు.. మేం చిన్న పిల్లలం, కానీ ఇప్పుడు వాళ్లని ఖంగు తినిపించే స్థితిలో ఉన్నాం’’ అంటూ కాంగ్రెస్ పార్టీకి జైపూర్‌లో సోషల్ మీడియా మార్కెటింగ్ బిజినెస్ చేసిన 45 ఏళ్ల మనీష్ సూద్ బాహాటంగానే వెల్లడించాడు. అయినా ఆన్‌లైన్‌లో మోదీని ఓడించడం అంత ఈజీ కాదు. ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఫేస్‌బుక్‌లో 43 మిలియన్ల ఫాలోవర్లతో ట్విట్టర్‌లో ఏకంగా 45 మిలియన్ల ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధిక మంది అనుసరించే రాజకీయ నాయకుడిగా ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ట్విట్టర్‌లో 8.1 మిలి యన్ మంది ఫాలోవర్లుండగా ఫేస్‌బుక్‌లో 2.2 మిలియన్ల మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాను సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నెటిజన్లను ఆకట్టుకు నే పనిలో జోరుగా పుంజుకుంటోంది.ఈ అంశంపై పరిశోధన జరిపిన ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లోని డీకిన్ యూనివర్సిటీకి చెందిన కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ ఉషా ఎం రోడ్రిగ్స్ అన్ని పార్టీలు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తు న్నాయని వెల్లడించారు. ప్రత్యర్థిపై విషం చిమ్మేలా సోషల్ మీడియాలో ప్రసంగించడం అనే పైత్యం వచ్చే ఎన్నికల్లో మరింత తారాస్థాయికి చేరుతుం దని వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్ పీస్ సంస్థలో రీసర్చ్ ఫెలోగా పనిచేస్తున్న మిలాన్ వైష్ణవ్ అంచనా వేశారు.  విచిత్రం ఏమిటంటే ప్రధాన పార్టీలన్నీ ఇదే పని చేస్తూ ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ అసత్య కథనాలు శరవేగంగా ప్రచారం చేస్తూనే మరోవైపు తాము ఇలాంటి వాటికి పాల్పడమ ని చేతులు దులిపేసుకోవడం. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై కాంగ్రెస్ పార్టీ మాటల దాడి చేస్తుంటే.. బీజేపీ వాటిని ఖండిస్తూనే ప్రజలకు దూరమైన పార్టీగా కాంగ్రెస్‌పై అదే సోషల్ మీడియాలో ఎదురు దాడి చేస్తోంది. ఈ నెల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధమైంది. ఈ మూడు హిందీ రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాత్మక విధానం అంతా సోషల్ మీడియా ను పునరుజ్జీవనం చేయడంగా నిపుణులు భావిస్తున్నారు.మనదేశంలో ఎన్నికలు గెలి పించేందుకు వ్యూహం అమలుచేయా లంటే ‘వార్ రూం’ ఉండాల్సిందే. అందుకే ఇటు పార్టీలు, అటు అభ్యర్థులు అంతా వార్ రూంలను ఏర్పాటు చేసు కుంటున్నారు. ఈ విష యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే లా పోటీపడుతున్నాయి. విజయం సాధించే ‘షార్ట్ కట్’గా వార్ రూంలు పేరుగాంచాయి. టెక్నాలజీ ని అనుసంధానం చేస్తూ.. ప్రచార సరళిని ఎప్పటిక ప్పుడు సమీక్షించుకుని.. వెనుకబడ్డ చోట్ల తిరిగి పుంజుకునేలా వార్ రూంలు సహకరిస్తున్నాయి.  జైపూర్‌లోని ఓ మూడు బెడ్రూముల ఇంటిలో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌లో న్యూస్ చానెల్స్ చూస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న బృందం ఎన్నికల్లో విజయంలో కీలక పాత్ర పోషించింది.  ఇక్కడ ఉన్న ముగ్గురు సభ్యుల బృందం ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ నిపుణులు పబ్లిక్ వెబ్‌సైట్లలో ప్రచారాన్ని మెరుపువేగంతో చేపట్టగా, మిగతావారంతా వాట్సప్ సందేశాలు కార్యకర్తలకు చేరవేయడంలో నిమగ్నమయ్యారు.మనదేశంలో ఉన్న వాట్సప్ యూజర్ల సంఖ్య అక్షరాలా 200 మిలి యన్లు కాగా ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య 300 మిలియన్లు. దాదాపు నెటిజన్లంతా మైనర్లు ఓటర్లే కనుక వీరిని ఆకట్టుకోగలి గితే ఎన్నికల యుద్ధం సుమారుగా గెలిచినట్టే కదా!  2019 ఎన్నికల్లో సోషల్ మీడియా పోషించబోయే పాత్రను గుర్తెరిగిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాలంటీర్లు 90,000 వాట్సప్ గ్రూపులను మేనేజ్ చేశారు. ప్రస్తుతం మనదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 450 మిలియన్లు కాగా 2014 ఎన్నికల సమయంలో కేవలం 155 మిలియన్ల మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులుగా ఉండేవారు. అంటే అమెరికా జనాభా కంటే మన స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల జనాభా చాలా ఎక్కువన్న మాట.  కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ తేల్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. వ్యక్తులపై, వ్యవస్థలపై అత్యంత ప్రభావం చూపే గ్యాడ్జెట్‌గా స్మార్ట్‌ఫోన్ ఆవిర్భవించింది.వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ కంటే వాట్సప్ రాజకీయ నాయకులకు తిరుగులేని ఆయుధంగా మారింది. జైపూర్ సమీపంలోని టోంక్ పట్టణంలో సంప్రదాయ రీతిలో ఎన్నికల ప్రచారం సాగినప్పటికీ దీనికి సమాంతరంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు వాట్సప్ గ్రూపుల్లో ప్రధానంగా ప్రచార పర్వాన్ని ఉరకలు పెట్టించారు. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ .. తాము 90వేల వాట్సప్ గ్రూపులను రాజస్థాన్‌లో మేనేజ్ చేయగా, బీజేపీ మాత్రం 15,000 వాట్సప్ గ్రూపులపై పెత్తనం చెలాయించినట్టు ఇందుకు సుమారు లక్ష గ్రూపులపై కార్యకర్తలు దృష్టి కేంద్రీకరించారని చెప్పడం విశేషం.  ‘‘బీజేపీ రాజస్థాన్ వారియర్స్’’ పేరుతో డజన్ల కొద్దీ వాట్సప్ గ్రూపులు కమలనాథులు నిర్వహించారు.  దీంతో వాట్సప్ తమకు అతిపెద్ద సవాలుగా మారిందని జైపూర్‌లోని సీనియర్ పోలీసు అధికారి నితిన్ దీప్ బ్లాగ్గన్ కుండబద్ధలుకొట్టారంటే పరిస్థితి తీవ్రత అర్థం అవుతుంది. మనదేశంలో కేవలం 5 సార్లు మాత్రమే మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసే అవకాశం ఉండగా ఇటీవల జరిగిన బ్రెజిల్ ఎన్నికల సమయంలో వేలాది అకౌంట్లను కంపెనీ స్థంభింపచేసింది. దీంతో మనదేశంలోనూ ఎన్నికల సమయంలో వాట్సప్ సంస్థ ఇదే విధానాన్ని అనుసరిస్తుందని భావిస్తున్నారు.  ఆటోమేటిక్‌గా అనవసరపు మెసేజీలను పంపే అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు ఈమేరకు తాము ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీచేసినట్టు వాట్సప్ సంస్థ కమ్యూనికేషన్స్ హెడ్, కార్ల్ వూగ్ స్పష్టంచేశారు. ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి వెల్లడించారు.  ఇదే బాటలో పయనించిన ట్విట్టర్ సంస్థ కూడా.. ఎన్నికల విధానాన్ని పరిరక్షిస్తామని, హానికరమైన చర్యలను గుర్తిస్తామని కూడా హెచ్చరికలు జారీచేసింది

Related Posts