YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దుర్గమ్మ సన్నిధిలో  అక్రమాలకు చెక్..  

దుర్గమ్మ సన్నిధిలో  అక్రమాలకు చెక్..  

దుర్గమ్మ సన్నిధిలో  అక్రమాలకు చెక్..  
- అన్నీప్రభుత్వ సంస్థల నుంచే కొనాలి 
-  ఓ ప్రత్యేక కమిటీ  పర్యవేక్షణ
- దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం.పద్మ

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ సన్నిధిలో చోటు చేసుకుంటున్న అక్రమాలకూ చెక్ పేటెందుకు ఆలయ పాలకవర్గం దుష్టి సారించింది. ఆలయానికి సబంధిచి ఏదైన్నా ప్రభుత్వరంగ సంస్థల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి ప్రసాదాల తయారీ, అన్నదానం, పూజల నిర్వహణ, ఆర్జిత సేవలకు.. అవసరమైన బియ్యం, నూనె, నెయ్యి, సెనగపప్పు, పచారి సరకులు, వస్త్రాలు.. అన్నింటినీ ఇక నుంచి ప్రభుత్వరంగ సంస్థల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం.పద్మ తెలిపారు.ఈ కొనుగోళ్లన్నింటినీ పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక కమిటీని వేయనున్నారు. కమిటీ ఆమోదించిన తర్వాతే కొనుగోళ్లు జరుపుతారు. ప్రభుత్వ విభాగాల నుంచే సరకులను కొనుగోలు చేయడం వల్ల నాణ్యత పెరగడంతో పాటూ ఆయా సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందించనట్టవుతుందన్నారు.

ఏటా కొనుగోలుకు రూ.30కోట్ల ఖర్చు...: దుర్గగుడికి అవసరమైన అన్నదాన, ప్రసాదం సరకులు, వస్త్రాలు, పూజాసామగ్రి కోసం అంతా కలిపి ఏటా రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంటారు. అయినా.. నాణ్యత విషయంలో రాజీ పడాల్సి వస్తోంది. భక్తుల నుంచి సైతం ఇటీవల ప్రసాదాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ ఆలయానికి అవసరమైన ఈ సరకులన్నింటినీ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో  ప్రైవేటు గుత్తేదారులు, సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరకుల నాణ్యతపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చాలావరకూ రెండో రకం సరకులనే సరఫరా చేస్తుండేవాళ్లు. ఆలయంలోని కొందరు వివిధ స్థాయిల్లోని సిబ్బంది  వీరికి సహకరిస్తూ వస్తున్నారు. దశాబ్దాలుగా ఇదే తంతు నడుస్తోంది. పైగా.. సరకులు వంద కిలోలు వస్తే.. 200 కిలోలు వచ్చినట్టు నమోదు చేయడం చేస్తూ.. జేబుల్లో వేసుకునేవారు. ఇటీవల.. విజిలెన్స్‌ నివేదికలోనూ స్టోర్స్‌లో జరిగే అక్రమాలను పక్కా ఆధారాలతో సహా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ప్రసాదాలకు ఇచ్చే సరకునూ.. ఎక్కువ ఇచ్చినట్లు చూపడం, మిగతాది పక్కదారి పట్టించడం జరుగుతోంది. అందుకే.. స్టోర్స్‌ విభాగంలో కొలువంటే సిబ్బంది పోటీ పడతారు. ఈ నేపథ్యంలో విజయకృష్ణ సూపర్‌ బజార్‌ లాంటి ప్రభుత్వ సంస్థల నుంచి సరకులను కొనుగోలు చేస్తే నాణ్యత పెరగడంతో పాటూ ధర కూడా ప్రైవేటు వారి కంటే తక్కువ ఉంటుందనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. అయితే.. ఇప్పటివరకూ ఈ దిశగా ఏ అధికారి ప్రయత్నం చేయలేదు. ఆలయ అభివృద్ధికి ఏమేం చర్యలు అవసరమో అన్నీ చేపడతాం. ఆలయానికి అవసరమైన సరకులన్నింటినీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచే ఇక నుంచి కొనుగోలు చేస్తామని స్పష్టం చేశఆరు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే పరిస్థితి లేదన్నారు. ఆలయాన్ని దాతల సహకారంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటికే  ప్రభుత్వ సంస్థలన్నింటితో  బుధవారం నుంచి సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు.
ప్రతి ప్రక్రియ పారదర్శకంగా..: దుర్గమ్మ సన్నిధిలో జరిగే ప్రతి ప్రక్రియనూ పారదర్శకంగా ఉండేలా చేసేందుకు  నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.. నిత్యం భక్తులు ఎంత మంది వచ్చారు, అన్నదానం స్వీకరించారు, రూ.3వేలు పైన ధర ఉన్న చీరలు ఎన్ని వచ్చాయనే వివరాలు రోజూ దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. నెలకోసారి దేవస్థానం ఆదాయం, వ్యయం ఎంతనేది వెబ్‌సైట్‌లో పెడతారు. దాతల సహకారంతో ఏఏ పనులు జరుగుతున్నాయనేది సైతం వివరాలతో సహా ఉంచుతారు. ఆలయానికి సంబంధించి వచ్చే ఫిర్యాదులు, వాటిపై వివరణలు వెబ్‌సైట్‌లో పెడతారు. ప్రస్తుతం అన్ని విభాగాలలో ఉన్న పద్ధతుల్లో మార్పు చేర్పులను వెంటనే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆలయంలో ఏటా రెండు సార్లు జరిగే అంతర్గత బదిలీలు సైతం పారదర్శకంగా ఉండేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
 

Related Posts