YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

జగన్ పిలుపుకు అడ్డంగా బుకైనా టీడీపి..

జగన్ పిలుపుకు అడ్డంగా బుకైనా టీడీపి..

జగన్ పిలుపుకు అడ్డంగా బుకైనా టీడీపి..
ఎంపీలంతా రాజీనామా చేసి ఒత్తిడి తెస్తే హోదా ఎందుకు రాదో చూద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి విసిరిన సవాల్ కి టిడిపి అడ్డంగా బుకైనట్టయింది.నెల్లూరు జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్ ఎంపీలంతా రాజీనామా చేసి ఒత్తిడి తెస్తే హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ కలిసి రావాలని జగన్ పిలుపునిచారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ కలిసి రావాలని జగన్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.  హోదా కోసం తమ పార్టీ  ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని.. టీడీపీకి చెందిన 25ఎంపీలతో చంద్రబాబు కూడా రాజీనామా చేయించడానికి సిద్ధమా అని చంద్రబాబుని నిలదీశారు. దీనితో అధికార పార్టీ టిడిపి పరిస్థితి  కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారైంది. అసలే బీజేపీతో పొత్తు కొనసాగించాలా వద్దా అని మీమాంసలో ఉన్న టీడీపీకి వైఎస్ జగన్ తాజా వ్యాఖ్యలు ఇరుకున పడేశాయి. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో  జగన్స వ్యాఖ్యలు సరికొత్త రాజకీయ పరిణామాలకు తెరతీశాయి..మరి టిడిపి  ఏ విధంగా స్పందిస్తో వేచి చూద్దాం.

Related Posts