YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేట్ కష్టాలు

 ప్రైవేట్ కష్టాలు
పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించేందుకు ప్రభుత్వం కొంతమంది పిల్లలను ఎంపిక చేసి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించింది. బెస్టు అవైలబుల్‌ పాఠశాలలుగా వాటిని గుర్తించి ఆయా యాజమాన్యాలకు ఏటా రూ.వేలు చెల్లిస్తోంది. వీటిల్లో కొన్నిచోట్ల సౌకర్యాలు బాగానే ఉన్నా మరికొన్ని చోట్ల తీసికట్టుగా ఉన్నాయి. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా కష్టమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. చదువుతో పాటు విద్యార్థులకు భోజనం, ఇతర వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. మెనూ మేరకు కొన్నిచోట్ల వండిపెట్టడం లేదన్నది తేటతెల్లమవుతోంది. 
జిల్లాలో మొత్తం 26 పాఠశాలలను బెస్టు అవైలబుల్‌గా అధికారులు గుర్తించినా కొన్నిచోట్ల మౌలిక వసతుల్లేవు. వీటిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో 450 మంది చదువుతున్నారు. ఇందులో 250 మంది విద్యార్థులకు చదువుతో పాటు భోజన వసతి(రెసిడెన్షియల్‌) అందిస్తున్నారు. 200 మంది నాన్ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే అత్యధిక పాఠశాలను గుర్తించారు. బొబ్బిలి, పార్వతీపురం పురపాలక సంఘాల్లో కొన్ని ఉన్నాయి. ఇక్కడ వసతి, మెనూ అందిస్తున్నారు. కొత్తవలస, చీపురుపల్లి, గరివిడి, భోగాపురం, గజపతినగరం ప్రాంతాల్లో వసతి లేదు. ఇక్కడ తరగతులకు పిల్లలు వచ్చి సాయంత్రానికి వెళ్లిపోవడమే. నాన్‌ రెసిడెన్షియల్‌ విద్యార్థికి ఏడాదికి రూ.15 నుంచి రూ.20 వేలు ప్రభుత్వం చెల్లించగా రెసిడెన్షియల్‌ విద్యార్థికి రూ.30 వేలు చెల్లిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. 10వ తరగతి వరకు అదే పాఠశాలలో విద్యార్థులు చదువులు సాగించే వెసులుబాటు కల్పించారు. కొన్నిచోట్ల మౌలిక వసతులు లేవు. అర్హత లేని ఉపాధ్యాయులతోనే తరగతులు నెట్టుకురావడంపై చదువులు తీసికట్టుగా మారాయి. వారంలో ఐదు రోజులు గుడ్డు పెట్టాల్సి ఉండగా మూడు రోజులే కొన్నిచోట్ల పెడుతున్నారు. సాయంత్రం పూట అల్పాహారం అంతంత మాత్రంగానే ఇస్తున్నారు.
పాఠశాలల ఎంపికకు ప్రత్యేక కమిటీని నియమించారు. ఆయా సభ్యులు అక్కడి సౌకర్యాలను గుర్తించి ఎంపిక చేయాల్సి ఉంది. కలెక్టర్‌, డీఈఓ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ, మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులు కలిపి ఐదుగురితో కమిటీ వీటిని ఎంపిక చేయాలి. విద్య, వసతి, నిష్ణాతులైన సిబ్బంది ఉన్నవాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. పది మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి చొప్పున ఉండాలి. డార్మెటరీ, వంటగదులు, క్రీడాస్థలం ఇలా అన్నిరకాల సదుపాయాలు ఉన్న పాఠశాలలకే ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇవేమీ కనిపించడంలేదు. చాలీచాలని వసతి, డార్మెటరీలు లేని పాఠశాలలను కూడా బెస్టు అవైలబుల్‌గా గుర్తించారన్న విమర్శలు ఉన్న

Related Posts