YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

చంద్రబాబుపై కేసీఆర్ ఒక్క సారిగా ఎందుకు రెచ్చిపోయారు..?.

 చంద్రబాబుపై కేసీఆర్ ఒక్క సారిగా ఎందుకు రెచ్చిపోయారు..?.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. చంద్రబాబుపై ఒక్క సారిగా అంతగా ఎందుకు రెచ్చిపోయారు..?. ఒకప్పటి తన రాజకీయ గురువు… సాటి ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా.. ఎందుకు అంతగా.. చెలరేగిపోయారు..? పక్క రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లు దెబ్బతింటాయని కూడా.. ఎందుకు ఆలోచించ లేదు..? అసలు చంద్రబాబను అంతగా.. విమర్శించాల్సినంత పెద్ద కారణం ఏముంది..?అన్నది సర్వత్రా చర్చనీయంశామైంది.మీడియా సమావేశంలో కేసీఆర్ అసహనం చూసిన వారెవరికైనా.. ఏదో తేడాగా ఉందనే అనిపించక మానదు. ఆ తేడా … “ఫెడరల్ ఫ్రంట్” అన్న అంచనాలు రాజకీయవర్గాల్లో వినిపించడం ప్రారంభించాయి. రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతోనే కేసీఆర్… జాతీయ రాజకీయ గురించి మాట్లాడటం ప్రారంభించారు. ఎంతగా.. అంటే.. ఫలితాలు వచ్చిన రోజునే ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన…” సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు అవసరమా అనే దగ్గర్నుంచి ఆర్బీఐ దగ్గర ఉన్న లక్షల కోట్లు ఏం చేసుకుంటారు..” అనే వరకూ …అన్నీ అంశాలు చర్చించారు. మధ్యలో రాజ్యాంగం గురించి కూడా… ప్రస్తావించారు. మంత్రివర్గం, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. అసెంబ్లీ ఇవన్నీ.. ఇక ట్రాష్. వెంటనే ఓ విమానం మాట్లాడేసుకుని జాతీయ రాజకీయాల కోసం బయలుదేరారు. అంతగా ఆయన .. “దేశ్‌ కి నేత”గా తనను తాను ఊహించేసుకున్నారు.తీరా ఏమయింది… ఒడిషా వెళ్లారు. అక్కడ పట్నాయక్‌తో మాట్లాడారు. అలా కోల్ కతా వెళ్లారు. కోల్‌కతా వెళ్లేలోపే .. బీజేడీ నుంచి ఓ ఎంపీ.. చంద్రబాబును కలిసి.. కేసీఆర్ ఏం చర్చించారో విపులంగా చెప్పి.. సలహాలు అడిగారు. పోనీ.. పట్నాయక్ కేసీఆర్‌కు ఏమైనా హామీ ఇచ్చారా అంటే… అలాంటివి మాట్లాడుకోవడానికి .. ఇప్పుడు చేతులు ఖాళీ లేవు.. చాలా సమయం ఉందని చెప్పి పంపిచేశారు. పోనీ.. మమతా బెనర్జీ అయినా… కాస్త ప్రొత్సాహం ఇచ్చారా అంటే.. ఆమె… ఏదో పని కోసం వచ్చే విజిటర్‌గా కేసీఆర్‌ను ట్రీట్ చేసి … ఒక్క మాట కూడా మాట్లాడకుండా పంపించేశారు. ఇక మాయావతి, అఖిలేష్‌లతో భేటీ అంటూ హడావుడి చేశారు. వాళ్లిద్దరూ.. ఢిల్లీలో ఉన్నప్పటికీ… మొహం చాటేశారు. దీంతో… ” నయా దేశ్‌ కి నేత..” మొహం వెళ్లాడేసుకుని హైదరాబాద్ వచ్చారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చంద్రబాబు మీద చూపించారు.రెండో సారి గెలిచిన కేసీఆర్‌.. తనకు తాను దేశ్‌కి నేతగా ఫీలవుతూంటే.. ఐదో సారి గెలవడానికి సిద్ధమవుతున్న నవీన్ పట్నాయక్‌కి ఎంత ఉండాలి..? మమతా బెనర్జీకి ఎంత ఉండాలి..? ఎనభై సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ రాజకీయ పార్టీల నేతలకు ఇంకెంత ఉండాలి..? వారంతా.. ఇప్పటికే చంద్రబాబు ఫోల్డ్ లో ఉన్నారు. ఆయన రాజకీయ అనుభవం.. సమస్యల్ని డీల్ చేసే విధానం పట్ల సంతృప్తిగా ఉన్నారు. కానీ.. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి.. బీజేపీ కోసమే.. కూటమి ప్రయత్నాలు చేస్తూ… తనను ఎవరూ పట్టించుకోలేదని.. దానికి చంద్రబాబే కారణం అనుకుని రెచ్చిపోవడం ఎందుకు..? ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనేమో అని చర్చించుకుంటున్నారు.

Related Posts

0 comments on " చంద్రబాబుపై కేసీఆర్ ఒక్క సారిగా ఎందుకు రెచ్చిపోయారు..?."

Leave A Comment