YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నూతన ఏడాది లో బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు..!!

 నూతన ఏడాది లో  బీఎస్ఎన్ఎల్  ఆఫర్లు..!!

 నూతన సంవత్సర కానుకగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కొత్త ఆఫర్లు ప్రకటించింది. ఈ వివరాలను హైద్రాబాద్ లో మంగళవారం తెలంగాణ టెలికాం సర్కిల్ సీజీఎం వి. సుందర్ వెల్లడించారు. మొబైల్ వినియోగదారులు వార్షిక-1699 ప్లాన్ లో భాగముగా రూ.1699 తో ఏడాదిపాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్ లు, ఉచిత కాలర్ ట్యూన్, అపరిమిత డేటా పొందవచ్చు. రోజుకు 2 జీబీ ఉపయోగించక  డేటా  వేగం 80 కేబీపీఎస్ కు  తగ్గిస్తారు. ఇవే ఆఫర్లు రూ.2,099 తో రీఛార్జి చేసుకునే వార్షిక ప్లస్-2009 కి వర్తిస్తాయి. అయితే రోజుకు 4 జీబీ వినియోగించాక డేటా వేగం 80 కేబీపీస్ కి కుదిస్తారు. గురు, శుక్ర, శని వారాల్లో  రూ.250 సోమ, మంగళ, బుధ వారాల్లో రూ.500, రూ.600 టాప్ అప్ తో పదిశాతం అదనంగా టాక్ టైం లభిస్తుంది. రాష్ట్రం లో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 487 వైఫై హాట్ స్పాట్లను నెలకొలిపింది. మరో 423 హాట్ స్పాట్లను ఫిబ్రవరి లోగ ఏర్పాటు చేయనుంది.

Related Posts