YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన అలీ..!!

  పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన అలీ..!!

సినీ నటుడు, పవన్ కళ్యాణ్ స్నేహితుడు అలీ వైసీపీలో చేరబోతున్నారు. ఈ రోజు అలీ జగన్ తో  భేటీ కానున్నారు. తొలుత మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని పశ్చిమగోదావరి జిల్లాలో కలిసి... అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్ వద్దకు వెళతారు. ఈనెల 9న ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా... వైసీపీలో అలీ చేరుతారు. గత నెల 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్ ను అలీ కలిసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, అలీ సాన్నిహిత్యం చూసి అందరూ అలీ జననసేన లో చేరి రాజముండ్రి నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు కానీ హఠాత్తుగా అలీ వైసీపీ లో చేరి పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చాడు.

Related Posts