YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

అవిశ్వాసం దిశగా జేఎఫ్‌సీ.

Highlights

  • తెరపైకి సరికొత్త ప్రతిపాదన

  •  కేంద్ర ప్రభుత్వానికి గురి 
అవిశ్వాసం దిశగా జేఎఫ్‌సీ.

 పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని జేఎఫ్‌సీ.. సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఎంపీల రాజీనామాల కన్నా.. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం మంచిదని సూచించింది. దీనివల్ల.. కేంద్రప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఏమాత్రం లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షను జాతీయస్థాయిలో.. పార్లమెంటు వేదికగా వినిపించే అవకాశం ఉంటుందని జేఎఫ్‌సీ అభిప్రాయపడుతోంది. ఇవాళ రెండోరోజు.. జెఎఫ్‌సీ భేటీ ముగిశాక.. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. యాభై మంది సభ్యుల బలముంటే అవిశ్వాసం పెట్టొచ్చన్న ఉండవల్లి.. ఆంధ్ర సభ్యులు అవిశ్వాసం పెడితే 42మంది ఎంపీలున్న కాంగ్రెస్ కూడా  మద్దతిస్తుందన్నారు. ఇతర పార్టీలను కూడా వ్యక్తిగతంగా మద్దతు కోరి.. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవచ్చని సూచించారు. ఈ ప్రతిపాదనను ఆచరణలో పెట్టేందుకు, అన్ని పార్టీలూ కలిసిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

 

Related Posts