YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

పెద్ద ఆసుపత్రి... చిన్న వైద్యం

 పెద్ద ఆసుపత్రి... చిన్న వైద్యం
నల్గొండ జిల్లా ఆసుపత్రిగా నియామక  ఉత్తర్వులు వచ్చినప్పటికీ... వైద్య సేవలు మాత్రం ఏరియా ఆసుపత్రివే అందుతున్నాయి... బ్లడ్ బ్యాంక్ ప్రారంభమై నెలలు గడుస్తున్న నేటికి వినియోగం లేదు..ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ప్రతి బిడ్డ  వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాల్సిందే. .పేరుకు పెద్ద ఊరుకు దిబ్బ అన్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర వైద్యశాల పరిస్థితి నెలకొంది..జిల్లా వైద్య కేంద్రంలో ఉండాల్సిన స్పెషలిస్టు వైద్యుల కొరత..250పడకలకు గాను ప్రస్తుతం 100 పడకలతోను కాలం గడుపుతుంది...జిల్లా వైద్య కేంద్ర నామ్స్ ప్రకారం అన్ని రకాల స్పెషలిస్టు డాక్టర్లు  ఉండాలి కాని ఇక్కడ మాత్రం ప్రత్యేక మైన స్పెషలిస్టులు లేరు 60 మందితో కూడా వైద్య బృంధం అవసరం ఉన్నప్పటికీ... ప్రస్తుతం 25 మంది వైద్యధికారులతో సాదసీద వైద్యసేవలు ప్రసవం, చిన్న చిన్న రోగులకు మాత్రం మే వైద్య సేవలు అందుతున్నాయి.జిల్లా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ కేంద్రం ప్రారంభించి నెలలు గడుస్తున్నప్పటికీ... వినియోగంలోకి మాత్రం రావడం లేదు... ఇక్కడి రోగులు యధావిధిగా బ్లడ్ కోసం హై దరాబాద్ ప్రాంతంలోని ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది...లేద వేలకు వేలు వెచ్చించి ప్రైవేటు బ్లడ్ బ్యాంక్‌ల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్ధితి ఉంది..జిల్లా పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండలోని  భువనగిరి డివిజన్‌ను  యాదాద్రి భువనగిరి జిల్లాగా ఏర్పాటు విషయం విదితమే..జిల్లా కేంద్రం కావడంతో ప్రజా అవసర నిమిత్తం  పెద్ద ఎత్తున జిల్లా ఆఫీసులు వచ్చి చేరాయి.అందులో భాగంగానే ప్ర జా వైద్యసేవల కోసం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా వైద్య కేంద్రంగా మార్చు తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ....ఆసుపత్రి నేమ్ బోర్డు మార్చారు కాని.. వైద్య సేవలు మాత్రం ఏరియా ఆసుపత్రివే అందుతున్నాయి...అరకోర వైద్య సిబ్బందితో పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్య అందించ లేక పోతున్నమంటున్నారు వైద్యధికారులు.హైవేపై అయిన రోడ్డు ప్రమాద  కే సులు సైతం ఇక్కడికే వస్తుంటాయి..ఇక్కడ జిల్లా వైద్య కేంద్ర ఆసుపత్రిలో ఉండాల్సిన ఎక్యూమెంట్స్ లేక పోవడంతో.. వైద్యం కోసం వచ్చిన వారిని హైదరాబాద్‌కు రెఫర్ చేయడం జరుగుతుంది..దీంతో ప్రయాణ మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయినవారు చాలానే ఉన్నారు.. కేసీఆర్ కిట్టు ప్రభావంతో గర్భిణీలు డెలివరీకి ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయి స్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో రోజుకు వందల మంది ప్రసవిస్తున్నారు...చిన్న పిల్లల స్పెషలిస్టులు కొరతతో.. పసికందుల వైద్య  ప్రయాణం  ప్రైవేటు వైద్యం వైపు వెలుతుంది...అర్ధ రాత్రి సమయంలో నైతే వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది..అర్ధరాత్రి పుట్టి న పాప యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఇటు ప్ర భుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఉండక..అటు ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్లు లేక.... ఎమర్జెన్సీ అయితే హైదరాబాద్‌కు ఊరుకల్సిం దే..జిల్లాలో వైద్యం అరచేతిలో ప్రాణవాయువు అన్నట్లు ఉంది

Related Posts