YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏప్రిల్ లో చంద్రయాన్

ఏప్రిల్ లో చంద్రయాన్
చంద్రయాన్ ప్రయోగాన్ని ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నట్టు ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. ఏప్రిల్ చివర వారం వరకూ ప్రయోగం నిర్వహించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ముందు అనుకున్న ప్రకారం జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రయోగం నిర్వహించాలని భావించారు. అయితే, కొన్ని రకాల పరీక్షలు మిగిలి ఉన్నందున మార్చి-ఏప్రిల్లో చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహించలేమని అన్నారు. ఇవన్నీ పూర్తిచేసి ఏప్రిల్ చివరి వారంలోనే ప్రయోగించడానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడుతూ వస్తోంది. చంద్రయాన్-1 ప్రయోగం నిర్వహించిన వెంటనే రెండో ప్రయోగానికి సన్నాహాలు మొదలయ్యాయి. అయినా తొలి దశ పూర్తయి దశాబ్దం గడిచినా రెండో ప్రయోగం ఇంకా పూర్తికాలేదు. దీన్ని తొలుత 2017 జనవరి తొలి వారంలోనే ప్రయోగించాలని భావించినా కుదరలేదు. దీంతో 2018కి వాయిదా పడింది. అయినా సాధ్యం కాకపోవడంతో 2019 ఏప్రిల్‌లో ప్రయోగం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.చంద్రయాన్-2 ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి.. అన్ని పూర్తిచేసి ఏప్రిల్ చివరి వారంలో ప్రయోగిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి ఇస్రో పనిచేస్తోంది. భారత్ తయారు చేసిన లునార్ అర్బిటర్, రోవర్‌‌తోపాటు రష్యాకు చెందిన లాండర్‌నూ రాకెట్ ద్వారా చంద్రుడిపైకి పంపుతారు. దీని ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ప్రయోగాలకు అవకాశం ఏర్పడుతోందని ఇస్రో భావిస్తోంది. జీఎస్ఎల్వీ ద్వారా ఇస్రో పంపిన రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగి అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయన విశ్లేషణ చేస్తుంది. ఈ సమాచారం చంద్రయాన్-2 ద్వారా భూమికి చేరుతుంది. చంద్రుడి అధ్యయనానికి ఇస్రో పంపిన తొలి మానవ రహిత నౌక చంద్రయాన్-1. దీనిని 2008 అక్టోబరు 24న పీఎస్ఎల్వీ ద్వారా దీనిని ప్రయోగించారు. సుమారు 1304 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం రిమోట్ సాయంతో పనిచేస్తుంది. 

Related Posts