YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రాజకీయాల్లో ఎపుడు ఏది జరిగిన ఆచ్చర్యపోనవసరం లేదు

రాజకీయాల్లో ఎపుడు ఏది జరిగిన ఆచ్చర్యపోనవసరం లేదు

రాజకీయాల్లో ఎపుడు ఏది జరిగిన ఆచ్చర్యపోనవసరం లేదు.ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతుంటాయి. ఎపుడెవరు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం.మిత్రులు శత్రువులు ..శత్రువులు మిత్రులు అవడం రాజకీయాలకీయలకే చెల్లు.పార్టీ వీడేది లేదు, “నా శవ యాత్ర కూడా పార్టీ జండాతోనే సాగుతుంద”న్న పెద్దమనిషి కూడా పార్టీ మారతాడు. అసలు ఉన్న పార్టీలన్నీ పాడువి,నేను కొత్త పార్టీ పెట్టి విప్లవం తెస్తున్నానన్న ఇంకో పెద్దాయన , పార్టీని తాను వ్యతిరేకించే పార్టీలో విలీనం చేస్తాడు. అలాగే బతుకు దెరువు కోసం మరొక పార్టీ బద్ధశత్రువయిన పార్టీ తో చేతులు కలుపుతుంది.ఇక పార్టీ ఫిరాయింపుల గురించి వేరే చెప్ప నవసరం లేదు. రాజకీయాలు నమ్మలేని విషయాలను నిజం చేస్తుంటాయి.  ఇపుడు దేశంలో సాగుతున్నరాజకీయ ఆటల నియమాలు చూస్తే ఇవేవి తప్పనిపించవు.ఇవి కచ్చితంగా తప్పని చట్టం కూడా చెప్పలేదు. కాబట్టి సర్వైవల్ కోసం నాయకులు ఏ నిర్ణయమయినా తీసుకోగలరు. సమర్థించుగోగలరు. తమాషా ఏమిటంటే, ఇవన్నీ ప్రజల బాగు పేరుతో రాష్ట్రం బాగు పేరుతో నడుస్తూంటాయి.ఇలాంటి మరొక నమ్మ లేని నిజం ఇపుడు తెలుగు రాష్ట్రాలలో ప్రజల ముందుకు వచ్చింది. మొదటిది, చంద్రబాబు తో కాంగ్రెస్ కలవడం. ఇది గత ఏడాది చూశాం.తొందర్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక విమానం లో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుసుకుని రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, ప్రజా స్వామ్య పరిరక్షణ, ప్రజాసంక్షేమం గురించి చర్చిస్తారు.దీనికి భూమిక తయారు చేస్తూ బుధవారం నాడు కెసియార్ కుమారుడు , తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెశిడెంట్ కె టి రామారావు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఒక ధఫా తమ అజండా గురించి చర్చించారు.ఈ సమావేశం చూస్తే జగన్, కెసియార్ భావసారూప్యం ఉన్న నాయకుల్లా కనబడతారు. ఈ విషయాన్ని కెటిఆయర్ చెప్పారు కూడా. కెసియార్, జగన్  ఎంత సన్నిహితులయ్యారంటే వాళ్లిపుడు ఒక జాతీయ అజండా తో ముందుకు దూసుకు పోతున్నారు. అవసరమయితే వచ్చే ప్రధాని ఎవరో తామే నిర్ణయించాలనుకుంటున్నారు. పరిస్థితులు ( ఇద్దరికి సమాన శత్రువు చంద్రబాబు నాయుడు కావడం) వారిరువురిని ఇంత దగ్గరకు చేర్చాయి.ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అంటే, తెలంగాణ ఏర్పాటును చివరిదాకా రాజీలేకుండా వ్యతిరేకించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డే. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వానికి అందరికంటే బాగా తెలుసు. అందుకే ఒక దశలో తెలంగాణ గడ్డ మీద జగన్ ను కాలుమోప నీయలేదు.

ఇక పొతే అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అపుడు జగన్ తెలంగాణలో ఓదార్పు చేపట్టాలనుకున్నారు. వైఎస్ హఠాత్తుగా చనిపోవడం అనేది తెలుగు ప్రజలను కోలుకోలేని దిగ్భాంతికి గురి చేసింది. దానికి తోడు ఆయన ప్రజాభిమానం వెల్లువతో ఆయన రెండోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వాతావరణంలో రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో షాక్ తిని చాలా మంది చనిపోయారని చెబుతారు. ఇలాంటి కుటుంబాలను పలకరించి ఓదార్చేందుకు జగన్ ‘ఓదార్పు యాత్ర’ మొదలుపెట్టారు. అది తెలంగాణ ప్రాంతానికి  వస్తున్నది. ఈ కార్యక్రమం మీద జగన్ వరంగల్ వెళ్లాలి.అప్పటికి జగన్ ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. కడప లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 మార్చి 28న ఆయన ఏడు రోజుల ఓదార్పు యాత్ర మీద వరంగల్ వెళ్లాలి. ఈ వరంగల్ యాత్రను టిఆర్ ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది.ఈ వ్యతిరేకత వరంగల్ లో హింసకు దారితీసింది. ఒక వ్యక్తి మృతి చెందాడు కూడా.యాత్రను మానుకోవాలని అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఆంధ్ర వ్యవహారాల ఇన్ చార్జ్ వీరప్పమెయిలీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వాదులు అప్పటికే జగన్ ను యాత్రను సాగనీయమని హచ్చరించారు. ఆ రోజు జగన్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రైలు లో మహబూబా బాద్ చేరుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులు జగన్ పర్యటన ఆపేయాలని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పూనుకున్నారు. మరొక వైపు జగన్ వస్తున్న రైలు మీద అవకాశం ఉన్నచోటల్లా రాళ్ల వర్షం కురుస్తూ ఉంది.జగన్ కు స్వాగతం పలికేందుకు మహబూబాబాద్ స్టేషన్ లో ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త ఎమ్మెల్సీ కొండా మురళి మీద కూడా దాడి జరిగింది. వారిని పోలీసుల సహాయంతో బయటకు పంపాల్సి వచ్చింది.  పరిస్థితి విషమిస్తూ ఉండటంతో జగన్ ప్రయాణిస్తున్న ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ ను వంగపల్లి వద్ద నిలిపివేశారు. జగన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ ప్రయాణం అక్కడే అగిపోయింది.జగన్ ని  హైదరాబాద్ కు తీసుకువచ్చి వదలిపెట్టారు.ఆ తర్వాత ఆయన చాలా కాలం తెలంగాణలో ప్రవేశించనేలేదు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి (టిజేఏసి) టిఆర్ ఎస్ నేతలు జగన్ యాత్రను కొనసాగనీయమని, అడ్డుకుంటామని ప్రకటించారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాని వ్యతిరేకిస్తున్న జగన్ తెలంగాణలో యాత్ర చేస్తే అడ్డుకునేందుకు ఎంతకయిన తెగిస్తామని ప్రకటించారు.ఇది 2010, మార్చి 28 నాటి జగన్- టిఆర్ ఎస్ ల మధ్య వున్న భీకర వైరం. అంతేకాదు, వైఎస్-కెసియార్ ల మధ్య కూడా శతృత్వమే ఉండింది. తెలంగాణ ఉద్యమం తలెత్తకుండా చేశారు. వైఎస్ బతికి ఉన్నంత వరకు కెసియార్ తెలంగాణ  ప్రస్తావన తేలేదు. అంతేకాదు, వైఎస్ బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని, టిఆర్ ఎస్ చీలిపోయి ఉండేదని కూడా  చాలా మంది అంటుంటారు.ఇపుడిదంతా గతం. నిన్న కెటియార్- జగన్ సమావేశం తర్వాత జగన్ చాలా అప్యాయంగా కెటియార్ ను ‘తారక్ ’ అని పిలిచారు. ఎంతో కాలంగా అన్యోన్యత ఉన్నట్లు వెల్లడించే పిలుపు అది.కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ చేసేందుకు పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఈ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కారణంతోనే బిజెపితో చేతులు కలిపారు. ఆయన గత ఏడాది బిజెపితో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ తో చేతులు కలిపి, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని చేసే క్యాంపెయిన్ లో ఉన్నారు. 

  

Related Posts