
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికలను సరిగ్గా నిర్వహించలేక వైఫల్యం చెందింది. సీఎం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడం చుస్తే ఎన్నికల కమిషన్ ,టి ఆర్ ఎస్ కుమ్మక్కు అయ్యిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డికే ఆరుణ అరోపించారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలపై జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గోన్నారు. ఆరుణ మాట్లాడుతూ ఒట్ల గల్లంతు పై ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. తీరా ఎన్నికలు అయినా తర్వాత రజత్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఎన్నికలో కూడా పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య ఓట్ల తేడా వచ్చింది. దేశవ్యాప్తంగా ఈవీఎంల పై అనుమానాలు ఉన్నాయి. అబివృది చెందిన దేశంలో కూడా పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలో పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలి. ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించలంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించాలని ఆమె అన్నారు.