
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నందు వల్ల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తహశీల్దార్ కార్యాలయంతో పాటు మరి కొన్ని కార్యాలయాల్లో విద్యుత్ ను గురువారం నిలిపివేశారు. తహశీల్దార్ కార్యాలయనికి సంబంధించి లక్షా 750 రూపాయలు, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి 2లక్షల 57వేల రూపాయలు బకాయిలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆర్ అండ్ బి కార్యాలయానికి సంబంధించి 49 వేల 300 రూపాయలు బాకీ వుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి 24 వేల రూపాయలు ఉంది. వసతి గృహాలు, అగ్నిమాపక , ప్రభుత్వ పాఠశాలలు ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లులు పెండింగ్ లో ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిపివేసామని అన్నారు. మరి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చామని విద్యుత్ అధికారులు తెలిపారు