
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పూర్తి మద్దతు ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన్ని వ్యతిరేకిస్తే రాహుల్ గాంధీని వ్యతిరేకించినట్టే. భట్టి లో మేం రాహుల్ గాంధీని చూస్తామని అయన వ్యాఖ్యానించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మంచి వ్యూహకర్త. తెలంగాణలో కూడా ప్రియాంక గాంధీ ప్రభావం ఉంటుంది. ప్రియాంక అయినా రాహుల్ గాంధీ అయినా మెదక్ నుండి పోటీ చేస్తే గెలిపిస్తామని అయన అన్నారు. . ఏఐసీసీ కి కూడా రాహుల్ లేదంటే ప్రియాంకలను మెదక్ నుండి పోటీ చేయించాలని లేఖ రాస్తానని అన్నారు. . తెలంగాణ ఇచ్చిన కుటుంబం మెదక్ నుండి పోటీ చేస్తే కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని జగ్గారెడ్డి సూచించారు.