
బాలికలు అన్ని రంగాలలో ముందుండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషా అన్నారు. గురువారం సిరిసిల్లలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవానికి ఆమే ముఖ్య అతిధిగా హజరు అయ్యారు.గతంలో మహిళల్ని వంటింటికే పరిమితం చేసే వాళ్ళు. ఈరోజు మహిళలు అన్ని రంగంలో దుసుకెళ్తున్నారు. విద్యా, ఉద్యోగాలలో గట్టి పోటినిస్తూ అన్ని రంగంలో ముందుకు వెళ్ళుతున్నారని అన్నారు. అంతేకాకుండా మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని, మన దేశంలో ప్రతి వెయి మందికి 940 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని అన్నారు. అడపిల్ల అంటే భారం కాదు వారు తమ అస్తి అని తల్లితండ్రులు గర్వపడే విధంగా ఎదగాలని, బాల్య వివాహలను పూర్తిగా అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఇవో రాధకృష్ణ , డివో సరస్వతి, డిఎస్ఓ. శ్రీనాధ్ తదితరులు పాల్గొన్నారు.