
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో వరంగల్ లో మావోయిస్టునల వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. జనవరి 25-31 మధ్య సమాదానే దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వారాన్ని గా జనవరి 31న భారత్ బందును జయప్రదం చేయండని మావోయిస్టులో పోస్టర్లలో పేర్కోన్నారు. భరత దేశాన్ని హిందూ రాజ్యాంగ మార్చనున్న న్యూ ఇండియా ఎదిరించండి వ్యతిరేకించండని పేర్కోన్నారు. సామాజిక రాజకీయ కార్యకర్తలను రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసారు. గురువారం రాత్రి ఈ పోస్టర్లు కనిపించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఏజెన్సీ వాసులు మాత్రం ఎప్పుడు ఏమి జరగబోతుందో తెలియని పరిస్థితి బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపధ్యంలో హిట్ లిస్ట్ లో ఉన్న నాయకులను మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు.