
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం, హిందూమహాసముద్రం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి .మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా 1.5 కి.మీ ఎత్తు వద్దగల ఉపరితల ద్రోణి బలహీనంగా మారుతోంది. ఈ కారణంగా మరో రెండురోజులు, రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.