
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణ కాంగ్రెస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ఏడు ముంపు మండలాలను ఏపీలో కలుపుతు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్పై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పై సోమవారం ఉదయం ఈ పిటిషన్ ను విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి పిటిషన్ను కొట్టివేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ముంపు మండలాలను ఏపీలో కలపడం కుదరదని శశిధర్ రెడ్డి తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కోర్టుకు తెలిపారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి విరుద్ధమని వాదించారు. వాదనలు విన్న అనంతరం ఈ కేసులో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది, ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ను గతేడాది నవంబర్లో హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.దాంతో అయన సుప్రీం మెట్లు ఎక్కారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలోని బూర్గుంపాడు, వెలియరపాడు, కుక్కునూరు, భద్రాచలం చింతూరు, కూనవరం, వరరామచంద్ర మండలాలను కేంద్రం ఏపీలో కలిపిన సంగతి తెలిసిందే. దీనివల్ల 200 పైచీలుకు గ్రామాల్లో దాదాపు 1.20 లక్షల మంది ఓటర్లు తెలంగాణనుంచి ఏపీకి మారారు.