
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రియాంకా గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గా నియమింపబడ్డారో అప్పటినుండి బీజేపీ నాయకులు కలవరపడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. ప్రియాంకకు బైపొలార్డ్ డిసార్డర్ వ్యాధి ఉంది అని సుబ్రమణ్య స్వామి ఆరోపణలను ఆయన ఖండించారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియా తో మాట్లాడుతూ ఇలాంటి వ్యాధి ఉంటే సంతోషం, కోపం అన్నీ ఎక్కువగా ఉంటాయి అని ఆయన ఆరోపిస్తున్నాడని, మరొకరు, ప్రియాంకా అందంగా ఉంటుంది, చాకలెట్ లాగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది అని అంటున్నారని, రాహుల్ ఫెయిల్ అయ్యాడు అందుకే ప్రియాంక వచ్చిందని పేర్కొనడం వారిలో నెలకొన్న భయానికి నిదర్శనమన్నారు. రాహుల్ కు చేయూత నివ్వడానికి రాజకీయాల్లోకి వచ్చిందన్నారు. సుబ్రమణ్య స్వామి నెగిటివ్ మనిషి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారని విఎచ్ దుయ్యబట్టారు. ఇంతకు ముందు జయలలిత వెంట ఉన్నారు. తరువాత ఆమె పైనే కేసులు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. రాజకీయాలలో వ్యక్తిగతంగా విమర్శలు మానుకోవాలని, హుందా రాజకీయాలు బీజేపీ నాయకులు చేయాలని విహెచ్ సూచించారు.