
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇరాక్ జైళ్లలో మగ్గుతున్న 14 మంది తెలంగాణ వాసులకు ఆ దేశ ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో ఇరాక్ ప్రభుత్వం14 మంది తెలంగాణ ఖైదీలను విడుదల చేసింది. బాధితులు ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి తెలంగాణలోని తమ స్వస్థలాలకు చేరేలా ఎంపీ కవిత అన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ భవన్ అధికారులు ఇరాన్ నుంచి వచ్చే ఖైదీలను రిసీవ్ చేసుకుంటారు.