YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మార్చి నాటికి అమల్లోకి మిషన్ భగీరధ

మార్చి నాటికి అమల్లోకి మిషన్ భగీరధ

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మిషన్ భగీరథ ప్రాజెక్టును విస్తృత ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 25,508 గ్రామాల్లో భగీరథ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనులు మూడు దశల్లో జరుగుతున్నాయి. వీటిలో ప్రధాన పైపులైన్ పనులు, ఓహెచ్‌ఎస్‌ఆర్, అంతర్గత పైపులైన్‌లు పనులు జరుగుతున్నాయి.ఆర్‌డబ్ల్యూఎస్ నిర్వహించే ప్రచారంలో అయా గ్రామాల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం, పైపులైన్ పనులు, నల్లా కనెక్షన్ వంటి అంశాలపై కూడా నివేదిక ఇవ్వనున్నారు.భగీరథ నుంచి వచ్చే నీటి వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయనే అంశంపై ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో భాగంగానే గ్రామీణ తాగునీటి సరఫరాశాఖ ఇంజనీరింగు విభాగంలో పనిచేస్తున్నసిబ్బందికి అప్పగించనున్నది.ఇతర సంస్థలకు కాకుండా తమ శాఖలోని ఇంజనీర్ల ద్వారానే ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులను నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలనిసంబంధితశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా నియోజకవర్గాలకు ఒక అధికారిని నియమించి ప్రజలకు అవగాహన కల్పించాలని తొలుత భావించారు.కానీ సిబ్బంది కొరత వల్ల ప్రతి డివిజన్‌కు ఒక అధికారికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అయా డివిజన్లల్లోని సిబ్బందికి కొన్ని గ్రామాలను అప్పగించి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.ఈ అవగాహన సదస్సుల్లో తాగునీటి వినియోగం, యాజమాన్యంపై చర్చించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మెటిరీయల్‌ను సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయా గ్రామాల్లో భగీరథ నుంచి తాగునీరు సరఫరా అవుతున్న ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసే విధంగా కాలపరిమితిని విధించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు యోచిస్తున్నారు. ఈ వివరాలపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం భగీరథ ప్రాజెక్టులో ఏదైనా మార్పులు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.  దీని ఆధారంగానే మార్చి నెల నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిసింది.   క్షేత్రస్థాయిలోకి వెళ్లిన సిబ్బంది రోజు వారీగా నివేదికలను ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారికి సమర్పించనున్నారు.ప్రజల అనుభవాలతో పాటు పనుల పురోగతిని కూడా నివేదికలో పొందుపర్చాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేయనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో భగీరథ వల్ల తాగునీటి సరఫరా, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారనే అంశాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది

Related Posts