YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బి.సిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని ఫిబ్రవరి 1 న చలో డిల్లీ

 బి.సిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని ఫిబ్రవరి 1 న చలో డిల్లీ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పార్లమెంట్ లో బి.సి బిల్లుపెట్టి చట్టసభలలో బి.సిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 27 శాతం నుంచి 50 శాతంకు పెంచాలని డిమాండ్ చేస్తు ఫిబ్రవరి 1 న చలో డిల్లీ కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ రోజు బి.సి భవన్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ సమావేశానికి జాతీయ ఉపాద్యక్షులు గుజ్జ కృష్ణ అధ్యక్షత వహించారు. డిల్లీలో రాష్ట్రపతిని, ఉప రాష్ట్రపతిని, కేంద్ర మంత్రులను, 36 ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి బి.సిలకు రావలిసిన వాటాను ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు.అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు పెట్టి వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారు. కాని ఉద్యోగ, రాజకీయ, పాలన రంగాలలో బి.సిలకు కనీస ప్రాతినిథ్యం లేని బి.సి కులాలను గత 71 సం.రాలుగా పట్టించుకోవడంలేదు. రాజకీయ రంగంలో బి.సి ల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వార తెలిసింది. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్ర మంత్రి వర్గంలో, లోక్ సభ, రాజ్య సభ, రాష్ట్ర అసెంబ్లీ లు, కౌన్సిల్లో 70 సంవత్సరాల బి.సి ల ప్రాతినిద్యం సర్వే చేసి లెక్కించగా, 14 శాతం దాటలేదంటే బి.సి లకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయంజరిగిందో తెలుస్తుంది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. డబ్బుల ప్రభావం ఎన్నికల మీద విపరీతంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో డబ్బులు లేని బి.సి లు ఎన్నికలలో గెలవలేరు. 70 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో 56 శాతం జనాభా గల బి.సి లకు రాజకీయ రంగంలో 14  శాతం ప్రాతినిధ్యం లేదంటే చట్ట సభలలో బి.సి లకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టవలసిన ఆవశ్యకతను తెలుపుతుంది. ఇటివల కేంద్ర ప్రభుత్వం జరిపిన ఉద్యోగుల సర్వేలో OBC లు 14 శాతం, అగ్రకులాలు 63 శాతం ఉద్యోగులు ఉన్నట్లు తెలిoది. 15 శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు 63 శాతం ఉద్యోగులుంటే ఇంకా వీరికి రిజర్వేషన్లు పెడుతున్నారు. అలాగే ఇక ఉన్నత స్థాయి అదికార పదవులలో మొత్తం 29 గవర్నర్ పదవులు, 21 వాణిజ్య బ్యాంక్ చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్ల పదవులన్నీ 100 శాతం అగ్ర కులాలకు దార దత్తం చేయబడినవి. ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు 98 శాతం అగ్రకులాలకే రిజర్వు కాబడి ఉన్నవి. ఇతర ఉన్నత స్థాయి అధికార పోస్టులలో 80 శాతం పోస్తులలో అగ్రకులా వారే ఉన్నారు. ఇక న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా సుప్రీంకోర్టు – హైకోర్టు జడ్జీలలో మెజారిటి అగ్రకులాలే ఉన్నారు. సుప్రీంకోర్టు లో 33 ఉండగా మొత్తం అందరు అగ్ర కులాల వారే ! దేశంలోని మొత్తం 749 హైకోర్టు జడ్జీల పదవులలో 39 బి.సిలు, 18 ఎస్.సి, 5 ఎస్.టి లు పోగా మిగిలిన 687 జడ్జీలు ఉన్నత కులాల వారే ఉన్నారు. ఇక ప్రభుత్వం వ్యవస్థలో భాగమైన మంత్రి వర్గ వ్యవస్థలో ఇంతవరకు కేంద్ర క్యాబినెట్లలో 70 శాతం మంత్రి పదవులు అగ్రకులాలవారే అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి పదవులు అన్ని అగ్రకులాలకే రిజర్వు చేయబడినవి.ఇలా న్యాయవ్యవస్థ రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలో 80 శాతం పదవులు అగ్రకులాల వారే పొందారు. పొందుతున్నారు. 15 శాతం జనాభా ఉన్న అగ్రకులాల వారు.  80 శాతం పదవులు పొందుతున్నారు.   15 శాతం జనాభా ఉండి 80 శాతం పదవులు పొందుతున్న అగ్రకులాల వారికే రిజర్వేషన్లు ఇవ్వడంలో ఉన్న శాస్త్రీయత ఏమిటి? హేతుబద్దత ఏమిటి ?  ఇది న్యాయమా ! ఇది చరిత్రను వక్రికరించడమే ! నిజాన్ని నిలువునా పాతర పెట్టడమే అవుతుంది. ఇటివల జరిపిన ఒక సర్వేలో ప్రైవేటు రంగంలోని ఎక్జుక్యుటివ్ ఉద్యోగాలలో 95 శాతం ఉధ్యోగాలు అగ్రకులాలు ఉన్నట్లు తెలింది. 15 శాతం జనాభా గల అగ్రకులాల వారికి ప్రైవేటు రంగంలో 95 శాతం, ప్రభుత్వ రంగంలో 63 శాతం ఉద్యోగాలుoటే ఇంకా వీరికి రిజర్వేషన్లు పెట్టడంలోని ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ దేశ సంపద, పరిశ్రమలు, డబ్బు, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టులు అధికారం ఎవరి చేతుల్లో ఉన్నాయి. 15 శాతం జనాభా ఉన్న అగ్రకులాల చేతుల్లో  90 శాతం రిజర్వేఅయ్యి ఉంది.  మరి వీటిని కూడా అన్ని కులాల జనాభా ప్రకారం వాటా పంచితే మన దేశంలో ప్రజలందరి ఆకలి, పేదరికం, నుంచి విముక్తులు అవుతారు కదా. వీటిని కుడా అన్ని సామాజిక గ్రూపులకు ఎందుకు విభాజించరాదు.? ఈ ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదన్నారు.అగ్రకులాల లోని పేదవారికి రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికగా ఇస్తారు.? ఏ ఆధారంగా ఇస్తారు? ఉద్యోగాలలో వారికి వారి జనాభా ప్రకారం ప్రాతినిథ్యం లేదని ఇస్తారా! కాలేజీలలో వారు చదువుకోవడం లేదని ఇస్తారా ! లేక సమాజంలో అగ్రకులాల వారికి సామాజిక, గౌరవం లేదని ఇస్తారా అనే కోణంలో చూడాలి. ఓట్ల కోసమని “విలువలు” లేకుండా వ్యవస్థను భ్రష్టుపట్టించే విధానాలు చేయడం రాజకీయ దివాళకోరుతనమని దృవపరుస్తుoది. నైతిక పతనావస్థను సూచిస్తుందన్నారు. ఈ సమావేశానికి జాతీయ ఉపాద్యక్షులు గుజ్జ కృష్ణ, రాష్ట్ర యువజన సంఘం అద్యక్షులు నీల వెంకటేష్, భుపేష్ సాగర్,  శేషగిరిరావు, సామల రవీందర్, జిల్లపల్లి అంజి, దాసు సురేష్, జైపాల్ ముదిరాజ్, .చందర్, రాజేందర్ గజేంద్ర తదితరులు పాల్గొన్నారు

Related Posts