.jpg)
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి, ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని గ్రామాలకు కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యుడు కడియం శ్రీహరి ని మంగళవారం మర్యాద పూర్వకంగా వరంగల్ లోని ఆయన నివాసంలో కలిశారు. గెలుపొందిన సర్పంచులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పారు. పరిశుభ్రతను పాటిస్తూ హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపొందించి బహిరంగ మల, మూత్ర విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దడానికి, వ్యక్తిగత మరుగుదొడ్ల అభివృద్ధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కోరారు.
గ్రామాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో నిరంతరం తాను అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.
ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని ధర్మసాగర్ , ఎలకుర్తి, నర్సింగ రావు పల్లి, సోమదేవరపల్లి, తాటికాయల, రాపాకపల్లి, రాయగూడెం, కాశగూడెం, జానకిపురం, కరుణాపురం, ధర్మపురం, మల్లక్ పల్లి, మల్లి కుదుర్ల, కమ్మరి పేట్, చింతల్ తండా, గొల్ల కిష్టం పల్లి, బండ తండా,మద్దెల గూడెం, షోడశ పల్లి, లోక్య తండా గ్రామాల సర్పంచులు నేడు కడియం శ్రీహరి ని కలిసిన వారిలో ఉన్నారు. ధర్మసాగర్, వేలేరు మండల్లాల్లో గెలిచిన సర్పంచులలో ఎక్కువ మంది కడియం శ్రీహరి అనుచరులు ఉండడం గమనార్హం.