YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చలితో గజగజ లాడుతున్న జనం

చలితో గజగజ లాడుతున్న జనం

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో పటాన్‌చెరును మబ్బు దుప్పటి కమ్మేసింది. రెండు రోజులు ర్రాతి పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చలి పంజా విసురుతుంది. జనం గజగజలాడుతున్నారు. పటాన్‌చెరు ప్రాంతంలో గత మూడు రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంచు కురిసింది.   చలిగాలులతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. పారిశ్రామికవాడ కావడంతో దఫాల వారిగా పనులకు వెళ్లె కార్మికులు చలికి వనుకుతూ విధులకు వెళ్లాల్సి వస్తుంది. బయటకు వెళ్లిన వారు పనులు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చలి బారి నుంచి రక్షించుకునేందుకు జనం స్వెట్టర్లు ధరించారు. శాలువాలు, దుప్పట్లు కప్పుకున్నారు. పలు చోట్ల చలి మంటలు వేసుకొని కాచుకున్న దృశ్యాలు కనిపించాయి. తీవ్ర చలిగాలులతో పటాన్‌చెరు పట్టణంలోని ప్రధాన రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. రోజు వారికూలీలు పనులకు దూరంగా ఉన్నారు. జనం లేకపోవడంతో ఫుట్‌పాత్ వ్యాపారాలు వెలవెలబోయాయి.గత నెలలో పెథాయ్ తుపాన్ దాటికి విల విలలాడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మరోసారి శీతల పవనాలతో గజ గజ వణికిపోతున్నారు. రెండు రోజులుగా కారు మబ్బులు కమ్మేసి మంచు దుప్పటి ఆవరించి భానుడు ముఖం చాటేయడంతో రహదారులు అందకారాన్ని తలపిస్తుండగా వీటికితోడు విదర్బ అల్పపీడన ద్రోణి ప్రభావంగా పట్టపగలే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి గడపదాటి బయటకు రావాలంటే జంకాల్సి వస్తోంది.
రెండు రోజుల క్రితం కనిష్ట ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలు నమోదుకాగా అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంగా ఒకేసారి పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి అత్యల్పంగా నమోదుకావడంతో గమనార్హం. కశ్మీరాన్ని తలపించే రీతిలో ఆదిలాబాద్‌లో మంగళవారం 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా భీంపూర్, అర్లిటిలో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.గత నెల 30న రికార్డుస్థాయిలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన చలి మళ్ళీ పంజా విసరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టపగలే సామాన్య ప్రజలు చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. మూడో విడత పోలింగ్ నేపథ్యంలో విధులకు హాజరయ్యే సిబ్బంది ముఖ్యంగా మహిళా ఉద్యోగులు మంగళవారం రాత్రి నాన అవస్థలు పడాల్సి వచ్చింది. ఉట్నూరు, బోథ్, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో 4.5 నుండి 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడం చలి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన తేలికపాటి, మోస్తారు వర్షాలకు 370 ఎకరాల్లో మిర్చి, పత్తి, కందులు, మొక్కజొన్న ఉత్పత్తులు దెబ్బతిని రైతులు నష్టపోగా కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట సైతం తడిసిమద్దయింది. తగ్గుముఖం పడుతుందని అందరు భావిస్తున్న తరుణంలోనే శీతల గాలులకు తోడు మబ్బుపట్టిన వాతావరణంతో పిల్లలు, వృద్దులు, రైతు కూలీలు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు, జ్వరాలతో ఏజెన్సీ పల్లెలు మంచం పడుతున్నాయి. మరో నాలుగు ఐదు రోజుల పాటు ఇదే స్థాయిలో చలి తీవ్రత ఉంటుందని ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో బయటకు వెళ్ళవద్దని, అత్యవసర సమయంలో ఉన్ని దుస్తుల రక్షణతో బయటకు వెళ్ళాలని వైద్యులు సూచిస్తున్నారు

Related Posts