YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అడ్డదిడ్డంగా నకిలీ నోట్లు మార్పిడి

అడ్డదిడ్డంగా నకిలీ నోట్లు మార్పిడి
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అదిలాబాద్ జిల్లాలో నకిలీ నోట్లు  చెలామణి అవుతున్నట్లు తెలిసింది. ఇటీవల సుమారు రూ. 4 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసు కున్నట్లు తెలిసింది. ముఠాలో ఎవరెవురు ఉన్నారన్న విష యంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.కాగజ్‌నగర్ కేంద్రంగా నకిలీ నోట్లు చెలమణి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నాలుగు రోజుల క్రితం స్థానిక రైల్వేస్టే షన్ సమీపంలో నలుగురు సభ్యులను పట్టుకున్నట్లు తెలిసిం ది. వీరి వద్ద రూ. 4 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని ఆరాతీయగా.. మరో ఇద్దరి పేర్లు వారు బయట పెట్టినట్లు తెలిసింది. ఐబీ తాండూర్‌కు చెందిన ఇద్దరి సభ్యుల తోపాటు వాంకిడి మండలానికి చెందిన ఇద్దరు సభ్యులు ఈ ముఠాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు అనుమాని స్తున్నారు. దొంగనోట్లను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా తయా రు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అనుమానితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రకు చెందిన ముఠాల ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.  నెలలో తిర్యాణిలో రైద్దెన పాత రూ. 500, రూ. 1000 నోట్లను అమాయక గిరిజనులకు అంటగట్టేందుకు ప్ర యత్నిస్తున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసు కున్న విషయం విదితమే. తాజాగా, కాగజ్‌నగర్‌లో నకిలీ నో ట్ల ముఠా పట్టుబడటం కలకలం రేపుతోంది. కాగజ్‌నగర్ కేం ద్రంగా రోజురోజకూ అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నా యి. నిషేధిత గుట్కాలు మహారాష్ట్ర నుంచి కుప్పలు కుప్ప లుగా కాగజ్‌నగర్‌కు చేరవేస్తున్న వ్యాపారులు ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. కాగజ్‌నగర్ కేంద్రంగా సాగుతున్న అక్రమ దందాలను అరికట్టేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటుండగా, ఇప్పుడు నకిలీ నోట్ల ముఠా పట్టుబడడం ఆందోళన కలిగిస్తున్నది.

Related Posts