YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైద్రాబాద్ డెవలప్ మెంట్ @ 2041

హైద్రాబాద్ డెవలప్ మెంట్ @ 2041

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోన్న హైదరాబాద్ మహానగర శివారులో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. అభివృద్ధి పథకాలు విశ్వనగరానికి మణిహారంగా కార్యరూపంలోకి రానున్నాయి. ఒక్కొక్క పథకం దేనికదే సాటిగా విశ్వనగర స్థాయిలో నిర్మాణం కానున్నాయి. ప్రణాళికాబద్ధమైన ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్‌ను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు అథారిటీ సన్నాహాలు చేస్తోంది. ప్రపంచస్థాయిని మించిన మినీ పట్టణాలు, ఉద్యానవనాలు, రహదారి సేదతీరు కేంద్రాలు(వేసైడ్ ఎమినిటీస్), వినోదాత్మక కేంద్రాలు, అంతర్జాతీయస్థాయి సమావేశ మందిరాలు, బహుళ అంతస్తుల పార్కింగ్ భవనం, ఐసిబిటి, శివారులో భారీ ట్రక్‌పార్కులు, మూసీ నది సుందరీకరణ, ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లో మోడల్ టౌన్‌షిప్ వంటివి నగరానికి సరికొత్త వన్నె తేనున్నాయి. వీటిని క్రమపద్ధతిలో చేపట్టేందుకు సిద్ధంచేసుకున్న ప్రణాళికను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండిఎ) పవర్ ప్రజంటేషన్ ద్వారా మాజీ పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావుకు వివరించింది. ప్రతిపాదిత, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పథకాలు కార్యరూపంలోకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్ మహానగర శివారు రూపురేఖలు మారనున్నాయి. ఈ పథకాలకు కెటిఆర్ కూడా సానుకూలంగా సంకేతాలు వెలువరించడం, తిరిగి ఆయనే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్‌కు మహర్దశ రానున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఔటర్ చుట్టూరా మినీ పట్టణాలు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయంతో ఓఆర్‌ఆర్ చుట్టూరా రవాణాధారిత గ్రోత్ కేంద్రాలైన 13 మినీపట్టణాలను హెచ్‌ఎండిఎ ఏర్పాటుచేయనుంది. వీటి పూర్తి విస్తీర్ణం మొత్తం 373 చ. కి.మీ.లుగా ఉంటే ప్రతి గ్రోత్‌కేంద్రం విస్తీర్ణం 28 చ.కి.మీలుగా అంచనా. ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ 158 కి.మీ.లు పొడవుగా ఉన్న ఓఆర్‌ఆర్‌కిరువైపుల ఉన్న 1 చ.కి.మీ. విస్తీర్ణంతో ఉన్న గ్రోత్ కారిడార్‌ను నూతనంగా రూపొందిస్తున్న సమీకృత మాస్టర్ ప్లాన్‌లో రింగ్ రోడ్‌కిరువైపులా 3 కి.మీ.లు(మొత్తం 6 కి.మీ.లు)గా ప్రతిపాదించాలనే యోచన చేస్తోంది. ఈ కారిడార్‌లో భూసమీకరణ పథకం(ల్యాండ్ పూలింగ్ స్కీం)ను అమలు పరిచేందుకు గతంలోనే కెటిఆర్ అనుమతి లభించింది. ప్రభుత్వం అనుమతిని తీసుకుని ల్యాండ్ పూలింగ్ స్కీంతో గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు వివరిస్తున్నాయి.భూసమీకరణ పథకం ముందుగా శివారులోని ప్రతాపసింగారంలో 250 ఎకరాలకు తక్కువగాకుండా, మేడిపల్లిలో 100 ఎకరాల్లోనూ, దూండిగల్‌లో 450 ఎకరాల్లోనూ, కంది, ఈదులనాగులపల్లి తదితర ప్రాంతాల్లో భూసమీకరణ పథకంను అమలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అందుకు రైతులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు.గండిపేటకు చేరువలోని కొత్వాల్‌గూడ వద్ద అథారిటీకి చెందిన 85 ఎకరాల్లో నైట్‌సఫారీని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పిపిపి) పద్ధ్దతిలో రూ. 250 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించాలనే ప్రతిపాదనున్నది. ఇందులో ఆసియా ఖండానికి చెందిన జంతురాశులు, ఫుడ్ కోర్టులు, ఔషధ మొక్కల వనం, గులాబితోట, వాటర్‌ఫాల్స్ వంటివి కొలువుదీరనున్నాయి. ఈ మేరకు అధికారుల బృందం సింగపూర్‌కు వెళ్ళి అధ్యయనం చేసింది. ఒక కన్సల్టెన్సీని పిలిచి నివేదికను సిద్ధం చేయాలనే యోచనలో ఉంది.పెద్దంబర్‌పేట్ సేదతీరు కేంద్రం ఓఆర్‌ఆర్ చుట్టూర జాతీయ, రాష్ట్రీయ రహదారులు కలిసే 13 కూడళ్ళు ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులు సేదతీరేందుకు ప్రత్యేక వసతులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ముందుగా పెద్దంబర్‌పేట్ కూడలిలో ఉన్న 40.84 ఎకరాల్లో రూ. 130 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులను కల్పించాలని హెచ్‌ఎండిఎ నిర్ణయించింది. అనంతరం బెంగళూరు కూడలిలోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. వీటి ఏర్పాటుతో అథారిటీకి ఏటా సుమారు రూ. 3 కోట్లు ఆదాయం చేకూరనుంది.మూసీనది సుందరీకరణ రూ. 377 కోట్ల అంచనా వ్యయంతో మూసీనదికిరువైపులా సుందరీకరణను చేయాలని అందుకు ప్రత్యేకంగా మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారుల బృందం గుజరాత్‌లోని సబర్మతి, రాజస్థాన్‌లోని మరో నది సుందరీ కరణణు అధ్యయనం చేసింది. అప్పుడు నగర మేయర్, మంత్రి కెటిఆర్‌లు కూడా వెళ్ళివచ్చారు. ఈ సుందరీకరణను పిపిపి పద్ధతిలోనూ కొన్ని పథకాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఇందులో బోటింగ్, ఓపెన్ థియేటర్, కాటేజెస్, కళాకేంద్రం, పార్టీ ప్రాంతం, చెక్‌డ్యాంలు, వ్యాపార భవన సముదాయం, ఆహారకేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఉప్పల్ భగాయత్‌లేఅవుట్ ఈపాటికే 413.32 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. మరో 72 ఎకరాల్లో ఉప్పల్ భగాయత్‌లో లేఅవుట్‌ను అభివృద్ధి పూర్తయింది. ఇంకో 105 ఎకరాల్లో లేఅవుట్‌కు సన్నాహాలు చేస్తోంది. వీటిలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ. 500 కోట్లు సంస్థ ఖజానాకు చేరనున్నాయి. ఈపాటికే లేఅవుట్‌ను సిద్ధంచేసింది అథారిటీ. ఇందులో మినీ శిల్పారామం, ఇక్కడి నుండి ప్రతాపసింగారం, కొర్రెముల మీదుగా ఘట్‌కేసర్ వరకు ప్రత్యేకంగా 150 అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలను అథారిటీ సిద్ధ్దం చేసింది.ఎండిపి లక్షం మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ప్లాన్ (మాస్టర్‌ప్లాన్)2041ను అథారిటీ రూపొందించడం జరగుతుంది. దీంతో అథారిటీ పరిధిలో ప్రణాళికబద్ధ్దమైన అభివృద్ధి కార్యరూపంలోకి వస్తుంది. ఈ ప్లాన్‌లో బహుళ ప్రయోజన కేంద్రాలు సొంత నియమ నిబంధనలతో వ్యవహరిస్తాయి. ప్రధాన మార్గాల్లో రవాణాధారిత అభివృద్ధి(టిఓడి)లను ప్రతిపాదించడం జరుగుతుంది. నగరం, శివారు ఈ రెండిటికి మధ్యన ఉన్న ప్రాంతాలను సమీకృతంగా కలుపుతారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ప్లాన్‌లో పొందుపరచడం జరుగుతుంది. ట్రాన్సిట్ ఓరియంట్ గ్రోత్ సెంటర్(టిఓజిసి)లు ప్రధాన నగరానికి మద్ధ్దతుగా అభివృద్ధి పరుస్తారు. ఈ ప్లాన్‌లో ప్రయోజనకర అభివృద్ధి, పురోగతిలోకి చేరే భూములు, భూవినయోగ ప్రతిపాదనలు, రోడ్ వ్యవస్థ ప్రతిపాదనలు వంటివి పొందుపరచడం జరిగింది.హెచ్‌హెచ్ కేంద్రం శివారులోని ఇజ్జత్‌నగర్‌లో 14.30 ఎకరాల్లో హైదరాబాద్ హ్యాబిటాట్ కేంద్రాన్ని రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. నిర్మాణం 4.66 లక్షల చ.అడుగులు. 575 కార్లు నిలుపుస్థలం వసతిని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నగర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చారిత్రక, కళ, సంస్కృతిక ప్రదర్శనలు, జాతీయ, అంతర్జాతీయ సదస్సు, సమావేశాలకు నిలయంగా ఉంటుంది. దీంతోపాటు ఇజ్జత్‌నగర్‌లోనే రూ.290 కోట్ల అంచనా వ్యయంతో 16.75 ఎకరాల్లో ఎంఐసిఈ అంతర్జాతీయ స్థాయి హోటళ్ళు, ప్రదర్శన, సమావేశాల మందిరాలు, కనీసంగా 400 కార్ల పార్కింగ్ సదుపాయంతో ఏర్పాటుకు సంస్థ చేసిన ప్రతిపాదనకు మంత్రి కెటిఆర్ గతంలోనే పచ్చజెండా ఊపడంతో ఆ దిశగా ప్రతిపాదనలు జరుగుతున్నాయి.గండిపేట్ డెవలప్‌మెంట్ అథారిటీ శివారులోని జలాశయమైన గండిపేట(ఉస్మాన్‌సాగర్)ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. అందులో భాగంగా గండిపేట్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీంతో ఇక్కడికి చేరువలోనే నైట్ సఫారీ కూడా రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతమంతా ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. రియల్‌కు ఊపు 158 కి.మీ.ల పొడవున్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూర రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత జోరందుకోనుంది. వచ్చే ఐదేళ్ళలో గ్రోత్ కారిడార్ ఒక ప్రణాళికా బద్ధమైన పట్టణాలు, మినీ నగరాలతో కొత్త రూపురేఖలు రానున్నాయి.

Related Posts