
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జిల్లాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చివరిదైన మూడవ విడత పోలింగ్ మందకొండిగా మొదలైంది. జిల్లా లో మూడవ విడతలో 126 సర్పంచ్ లు,1044 వార్డు సభ్యుల ఎన్నికలకు గాను 1412 బ్యాలెట్ బాక్సులు, 3024 మంది సిబ్బంది తో పోలింగ్ నిర్వహించారు. బుధవారం భువనగిరి , బీబీనగర్, పోచంపల్లి, నారాయణపురం,చౌటుప్పల్, యాదగిరిగుట్ట మండలంలోని మొత్తం 148 గ్రామ పంచాయతీలకు గాను 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు మిగిలిన 126 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరిగింది. ఈ విడత పోలింగ్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు జరిగిన ఎన్నికల్లో 126 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కోసం 377 మంది ఎన్నికల్లో పోటీ పడ్డారు. 1044 వార్డు సభ్యుల కోసం 2607 మంది పోటీలో వున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెబ్ కాస్టింగ్ ,వీడియో కవరేజ్ చేసారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాచకొండ కమిషనర్ ఆదేశాల భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నారు.