YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాత బస్తీలో పోలీసుల సోదాలు

పాత బస్తీలో పోలీసుల సోదాలు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

హైదరాబాద్  పాతబస్తీ డబిర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారత్ నగర్ లో సౌత్ జోన్ డీసీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో 150 మంది పోలీసు సిబ్బంది తో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనీఖిలలో సరైన ధ్రువపత్రాలు లేని 94 ద్విచక్రవాహనాలు , 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పది మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిల్వ ఉంచారన్న పక్కా సమాచారం తో కల్తీ హెర్బల్ ప్రొడక్ట్స్  ని స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ ప్రజలు స్వచ్చందంగా తమ తమ బస్తీలలో కార్డెన్ సెర్చ్ చేయాలనీ కోరుతున్నట్లు తెలిపారు.

Related Posts