
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అపాయింటెడ్ డేను ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఫిబ్రవరి 2న అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించి పాలకమండలి తొలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. తొలి రెండు విడతల్లో 7,043 పంచాయతీలకు పోలింగ్ జరగ్గా.. మూడో విడతలో భాగంగా ఈరోజు 3,529 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం ఓట్ల లెక్కింపు అనంతరం నేటితో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తం కానుంది.