
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పార్లమెంట్ లో కేంద్రం పై టిఆర్ఎస్ ఎంపీలు పలు సమస్యలపై పోరాటం చేస్తామని, తెలంగాణ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 80 శాతంకు పైగా టిఆర్ఎస్ మద్దతుదారులే గెలుపొందారనీ నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. నవిపెట్ మండలం పోతాంగల్ గ్రామంలో 3వ విడిత పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. ఇక జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అన్నారు. తెలంగాణ లో 17 స్థానాల్లో ఎం ఐ ఎం పార్టీకి ఒక్క స్థానం పోను మిగితా 16స్థానాల్లో టీఆరెస్ దే విజయం ఖాయం అన్నారు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం పై నరేంద్ర మోడితో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. ఈ రోజు టీఆర్ఎస్ ఎంపీలందరం ఢిల్లీకి వెళ్తున్నామని స్పష్టం చేశారు. కొత్త సచివాలయం కోసం డిఫెన్స్ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. ఈ విషయంతో పాటు పెండింగ్ సమస్యలు పై ప్రధాని నరేంద్ర మోదీ ని కలిసి నిలదిస్తామన్నారు. గరిబి హటావ్ పేరుతో కాంగ్రెస్ చేపట్టే నినాదాలు స్లొగన్స్ కే పరిమితం అన్నారు. ప్రియాంక గాంధీ వచ్చిన దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీయేటర పార్టీలు కేంద్రంలో అధికారంలో రావాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ బాధితుల విషయంలో మోసం చేస్తున్న ఏజెంట్ల పై తీసుకొని చర్యలు కఠినతరం చేయాలనీ, నకిలీ ఎజెంట్ల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అభివృద్ధి కి రెఫరెండం గా భావించి ప్రజలు ఓటేసున్నారని తెలిపారు.