
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నో అంచనాలతో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. 2014 ఎన్నికల తర్వాత తొలి కేంద్ర కేబినెట్‌లోనే తెలంగాణకు అన్యాయం చేస్తూ పోలవరం ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపేలా ఆర్డినెన్స్ తెచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. దేశానికి మేలు చేస్తాయన్న ఉద్దేశంతోనే అనేక విషయాల్లో కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించారని తెలిపారు తెలంగాణకు అన్యాయం చేసేలా వ్యవహరించినందు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించారని కవిత అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో వన్‌సైడ్ వార్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి నిజామాబాద్‌లో పసుపు బోర్డు కోసం ప్రయత్నిస్తునే ఉన్నామని కవిత తెలిపారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటైతేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంటు సమావేశాల్లో విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తామని కవిత తెలిపారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ ఫథకాల వల్లే పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు 80శాతానికి పైగా గెలుపొందారన్నారుధాని మోదీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్నారు. అన్ని రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయి. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎంపీ నిధులు ఏడాదికి కనీసం రూ. 25 కోట్లు ఉండాలన్నారు. మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం ఆమోదించలేదు. రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలి. టీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తోంది. నిజామాబాద్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలిగింది. రాబోయే రోజుల్లో నిజామాబాద్‌లో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు ఉండవన్నారు. పసుపు బోర్డు కోసం పోరాటం కొనసాగుతోంది. విభజన సమస్యల నుంచి మొదలుకొని రాష్ర్టానికి కేటాయించే నిధుల వరకు ప్రధాని మోదీ తెలంగాణపై వివక్ష కనబరిచారని కవిత పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీతో పాటు ఇతర పార్టీలను కలుస్తాం. రాహుల్ గ్రాఫ్ లో ఎలాంటి పెరుగుదల లేదని కవిత స్పష్టం చేశారు.