
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీతాఫల్ మండిలో నిర్మాణంలో ఉన్న మల్టీమోడల్ ఫంక్షన్ హల్ పనులను, ఇతర అభివృద్ది కార్యక్రమాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ బుధవారం ఉదయం తనిఖీ చేశారు. మాజీ మంత్రి, సికింద్రాబాద్ శాసన సభ్యులు టి.పద్మారావు, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్ తో కలిసి సికింద్రాబాద్ సర్కిల్లో పర్యటించారు. దాదాపు రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీమోడల్ ఫంక్షన్ హల్ త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పేదలకు అందబాటులో ఉండేలా కనీసం ఒక మల్టీమోడల్ ఫంక్షన్ హల్ను నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలి దశలో రూ. 30.32 కోట్ల వ్యయంతో 16 మల్టీమోడల్ ఫంక్షన్ హళ్ల నిర్మాణాలు చేపట్టామని వివరించారు. ఒక్కో ఫంక్షణ్ హలును కనీసం 3,300 చదరపు గజాల స్థలంలో, 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మల్టీలేవల్ ఫంక్షన్ హల్ నిర్మిస్తున్నామని, దీనిలో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లలో 12,350 చదరపు అడుగుల విస్తీర్ణంతో చేపట్టామని పేర్కొన్నారు. చిలుకలగూడ మోడల్ ఫంక్షన్ హలును ఏసి ఫంక్షణ్ హలుగా రూపొందించి రాష్ట్రంలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి పద్మారావు కమిషనర్ కు సూచించారు. దీంతో సవరించిన అంచనాలు పంపించాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. మార్చి ప్రారంభంలోగా ఈ ఫంక్షన్ హళ్లు ప్రజలకు అందుబాటులోకి తేవాలని దానకిషోర్ పేర్కొన్నారు. నామాల గుండులో ఖాళీగా ఉన్న 3వేల గజాల స్థలంలో మోడల్ మార్కెట్ గానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాలని అన్నారు. అదేవిధంగా చిలుకలగూడలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన 3వేల గజాల స్థలంలో వాకింగ్ ట్రాక్ను నిర్మించి ఎగ్జిబీషన్లు తదితర కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగించాలని అనంతరం మధురానగర్లో నిర్మాణంలో ఉన్న కమ్యునిటి హాలు ను పరిశీలించారు. సికింద్రాబాద్ డిప్యూటి కమిషనర్ రవికుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ అశ్విన్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు హాజరయ్యారు