YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎగ్జిబిషన్ 3 రోజులు క్లోజ్.. అవసరమైతే పొడిగిస్తాం: ఈటల

ఎగ్జిబిషన్ 3 రోజులు క్లోజ్.. అవసరమైతే పొడిగిస్తాం: ఈటల

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అగ్ని ప్రమాదం నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ను మూడు రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు క్లోజ్ అవుతుందని.. అనంతరం ఎగ్జిబిషన్ యథావిధిగా కొనసాగుతుందన్నారు. అవసరమైతే ఈ నెలాఖరు వరకు పొడిగిస్తామని తెలిపారు. నష్టపోయిన వారిని ఎగ్జిబిషన్ సొసైటీ, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. బాధితులు తమ కుటుంబ సభ్యులని.. వారికి పూర్తి న్యాయం చేస్తామన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని కోరారు. మొత్తం 300 షాపులు దగ్ధమయ్యాయన్నారు. సకాలంలో మంటలను ఆర్పలేకపోయామని... అందుకే నష్టం వాటిల్లిందన్నారు. అయితే ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు

Related Posts