YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ దుర్ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి బిజెపి డిమాండ్

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ దుర్ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి                      బిజెపి డిమాండ్
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని, ఈ దుర్ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మన్‌, బిజెపి శాసనసభ పక్ష నాయకులు రాజాసింగ్‌, శాసన మండలి బిజెపి  పక్ష నాయకులు ఎన్‌.రామచందర్‌ రావు,  బిజెపి  నాయకులు జి. కిషన్‌ రెడ్డి  గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ బిజెపి  పక్ష నాయకులు శంకర్‌ యాదవ్‌లతోపాటు బిజెపి రాష్ట్ర నాయకులు, నగర నాయకులతో కూడిన బిజెపి ప్రతినిధి బృందం నేడు ప్రమాద స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మన్‌ మాట్లాడుతూ... కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా, స్థానిక ప్రజా ప్రతినిధులను పరిగణనలోకి తీసుకోకుండా ఎగ్జిబిషన్‌ సొసైటీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ నగరం నడిబొడ్డున ఉండడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు కానీ, దుర్ఘటనలు జరిగితే ఆస్తి నష్టంతోపాటు, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన భద్రత చర్యలతో శాశ్వత ప్రాతిపదికన విశాలమైన ప్రదేశంలో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.ఎగ్జిబిషన్‌ సొసైటీ సభ్యులతో బిజెపి బృందం సమావేశమైంది. బాధితులు కశ్మీర్‌, గుజరాత్‌, కోల్‌కతతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ సొసైటీకి రావడం జరిగిందని, అందులో వారి వర్తక సామాగ్రి ధ్వంసమై, కౌంటర్‌లో ఉన్న డబ్బు కూడా అగ్నికి ఆహుతయిన విషయాన్ని సొసైటీ ద ష్టికి తీసుకెళ్లారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా డబ్బులు చెల్లించామని, అగ్నిమాపక దళాలకు కూడా డబ్బులు వెచ్చించామని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని సొసైటీ సభ్యులు చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సొసైటీ సభ్యులు కూడా బాధ్యత తీసుకొని బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని బిజెపి బ ందం కోరింది. కనీసం ఇన్సూరెన్స్‌ చేయకుండా స్టాల్స్‌ ఏర్పాటు చేయడం సొసైటీ బాధ్యతారహిత్యానికి నిదర్శమని డా.కె.లక్ష్మన్‌ విమర్శించారు. బాధితులకు న్యాయం జరగకపోతే బిజెపి రాష్ట్ర శాఖ ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. గుడి పై కూడా స్టాల్స్‌కు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలను కూడా పట్టించుకోకుండా గుడిపై స్టాల్స్‌ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని లక్ష్మన్‌ డిమాండ్‌ చేశారు.సకాలంలో తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని, దాదాపు 500 దుకాణాలు ధ్వంసం కావడం బాధాకరమైనదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. వేలాది దుకాణాలకు అనుమతి ఇచ్చినప్పుడు కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడం సొసైటీ వైఫల్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని స్పష్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా దుకాణాలకు అనుమతివ్వడం దురద ష్టకరం అన్నారు.హైదరాబాద్‌ నుమాయిష్‌ (ఎగ్జిబిషన్‌) దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిందని, దీనికున్న పేరును రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ చెడగొడుతుందని మండిపడ్డారు. కనీసం అత్యవసర ద్వారం కూడా తెరవలేని పరిస్థితిలో సిబ్బంది ఉండడం బాధాకరమన్నారు. ఒకవైపు దుకాణాలు అగ్నికి ఆహుతి అవుతుంటే మరోవైపు సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో అనేక దుకాణాలలో లూటీ జరగడం ఆందోళనకరమని అన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఇక్కడ అమ్ముకోవాలని వస్తే లూటీ జరగడం బాధాకరం అని అన్నారు. బాధితులకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.దగ్ధమైన స్టాల్స్‌ ఒకట్రెండు రోజుల్లో పునర్నిర్మాణం చేపట్టేడమే కాకుండా బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, బాధితులకు నష్టపరిహారంతో సహా అన్ని చర్యలు చేపడతామని బిజెపి బ ందానికి సొసైటీ సభ్యులు హామీ ఇచ్చారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ స్వతంత్ర సంస్థలా వ్యవహరించడం సరైంది కాదు. భవిష్యత్తులో సొసైటీ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు రాజా సింగ్‌, పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎన్‌.రామచందర్‌ రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను పిలిచి సమావేశంలో భద్రతా ప్రమాణాలపై తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.పూర్తిస్థాయిలో డబ్బు చెల్లించినా, రసీదులు మాత్రం కొంత డబ్బుకే ఇస్తున్నట్లు స్టాల్స్‌ ఏర్పాటు చేసిన వారు బిజెపి బ ందానికి వివరించారు. దీనిపైనా సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డా.కె.లక్ష్మన్‌ డిమాండ్‌ చేశారు.రాజాసింగ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఏ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారో కూడా తెలియడం లేదని వాపోయారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించకపోవడం సరైంది కాదని విమర్శించారు. ఇలాంటి భారీ ప్రమాదాలు జరుగుతాయని గతంలోనే శాసనసభలో ఆందోళన వ్యక్తం చేశామని గుర్తుచేశారు. గుడితో పాటు బాత్రూములను సైతం వదలకుండా స్టాల్స్‌ ఏర్పాటు చేయడం బాధాకరం అని అన్నారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దురద ష్టకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నిద్రమత్తు వీడి ఇకనైనా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని కోరుతున్నామని అన్నారు.ఎన్‌.రాంచందర్‌ రావు మాట్లాడుతూ.. జరిగిన సంఘటన తీవ్రమైందని, తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడం దురద ష్టకరమని అన్నారు.

Related Posts