
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్ ను మిగతా రాష్ట్రాల తో పాటు కేంద్రం కూడా అమలు చేస్తోంది. రైతు బందు స్కీమ్ కింద కేంద్రం కంటే మా ప్రభుత్వం ఎక్కువ సాయం చేస్తోందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. రైతు బందు పథకాన్ని కేంద్రం 3 సంవత్సరాల క్రితం అమలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు పక్కన పెట్టి టీఆరెస్ ను ఎలా గెలిపించారో పార్లమెంటు ఎన్నికలలో కూడా అలాగే గెలిపిస్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిందే. రైతులను ఆకర్షించడానికే ఈ బడ్జెట్. దక్షిన భారత్ లో గతంలో బీజేపీ కి ఎక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదు.ఇపుడు కూడా రావని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. విభజన సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో పోరాడతామని అయన వెల్లడించారు.