
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాల లో, శనివారము నూతన సర్పంచులు ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సర్పంచ్ గా పడాల వనిత శ్రీనివాస్,సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, పల్లెపాడులో సొక్కులా మోహన్ రెడ్డి, బాబుల్ నాయక్ తండ లో రమేష్,బద్దు తండాలో సురేష్, చిన్న లక్ష్మాపూర్ లో శ్రీనివాస్ రెడ్డి,బిల్యా నాయక్ తండా లో జ్యోతి, చొక్కల తండాలో సరిత,దత్తయ్యపల్లిలో రామ్మోహన్ శర్మ,దయ్యం బండ తండాలో లలిత, ధర్మారంలో మగుతయ్య,గంధమాళ్లలో వాణీ,గొల్ల గూడెం లో మీనా, గోపాల్ పురం జ్యోతి, ఇబ్రహీంపూర్ లో మహేందర్, ములకలపల్లిలో మల్లప్ప, కొండాపూర్లో మల్లేశం,కోనాపూర్ లో అండమ్మ,మాదాపూర్ లో పోశమని, మల్కాపురంలో అమల,జేతురం తండాలో లలిత,మోతిరాం తండాలో బిచ్చు నాయక్,నాగాయపల్లి లో నిర్మల,పెద్ద తండాలో బాబు,రామోజినాయక్ తండాలో శారదా,రాంపూర్ తండాలో మంజుల, రుస్తాపూర్ లో లావణ్య, తిరుమలాపూర్ లో సత్యనారాయణ, వీరారెడ్డిపల్లి లో వాణి, వెంకటాపూర్లో కల్లూరి ప్రభాకర్ రెడ్డి,సర్పంచ్ లుగా,ఉపసర్పంచ్ లు,వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకరణను ప్రత్యేక అధికారులు చేయించారు. అనంతరము గ్రామస్తులు సర్పంచులను ఉప సర్పంచ్ వార్డు సభ్యులను శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ పిన్నపు నరేందర్ రెడ్డి, ఎంపిటిసి తలరి శ్రీనివాస్,కో అప్సన్ యాకుబ్,మాజీ ఎంపీపీ బోరెడ్డి రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ పడాల చంద్రం,ప్రత్యేక అధికారులు,ఏం ఆర్ ఓ నరసింహ్మ, ఎంపీ డి ఓ ఉమాదేవి,ఏ ఓ దుర్గేశ్వరి, గ్రామ కార్యదర్శులు, నాయకులు, గ్రామస్తులు, పాల్గొన్నారు