YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యుద్ధానికి సిద్ధం

 యుద్ధానికి సిద్ధం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలంగాణాలో 2019 సంవత్సరం ఎన్నికల ఏడాదిగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నెల రోజులకే పంచాయతీ పోరు జరిగింది.  ఆ వెనువెంటనే మరో సంగ్రామానికి తెర లేచింది. పార్లమెంట్, జిల్లా పరిషత్ ఎన్నికలు సైతం మరో మూడు నెలల్లో నిర్వహించనున్నారు. వీటితో పాటు మునిసిపాలిటీ, సహకార, సాగునీటి సంఘాల ఎన్నికలకు కూడా రంగం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం  నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మరోసారి రాజకీయం వేడెక్కుతోంది. కొత్త సంవత్సరమంతా ఎన్నికల ఏడాదిగానే ఉండనుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది రాష్ట్రం. 
ప్పటికే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసుకున్న రాష్ట్రం వెనువెంటనే పార్లమెంట్, ఎమ్మెల్సీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ దూకుడు పెంచింది. రాబోయే ఎన్నిలకు సంబంధించి కీలకమైన ఐదు కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. పార్టీ కీలక పదవులకు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఎన్నికల్లో తమ వ్యూహాలకు పదును పెట్టేందుకు నేతలు సిద్దమవుతున్నారు.
తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పీసీసీ ఎన్నికల కమిటీలను ప్రకటించిన అధిష్టానం... దక్షణాదిన కీలక రాష్ట్రమైన తెలంగాణాకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ, ప్రచార, పబ్లిసిటీ, మీడియా సమన్వయ, ఎన్నికల సమన్వయ కమిటీలను ప్రకటించింది. దీంతో మాజీ ఎంపీ విజయశాంతికి ఏఐసీసీ... కీలక బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్ ఎన్నికల దృష్ణ్యా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా విజయశాంతిని నియమించింది. కో చైర్ పర్సన్ గా డీకె అరుణను నియమించింది. మొత్తం ఈ కమిటీలో 20 మందికి అవకాశం కల్పించారు.  ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) ని 24 మందితో ప్రకటించింది.
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం నియమించిన పీఈసీలో 50 మందికి పైగా సభ్యులు ఉండగా.. ఈ సారి ఆ సంఖ్యను 24కు కుదించింది. పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించింది. 16 మంది సభ్యులకు ఈ కమిటీలో ఛాన్స్ దక్కింది..... ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ గా  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియాను నియమించింది. ఈ కమిటీలో 37 మందికి చోటు కల్పించారు..... ఎన్నికల కమిటీ బాధ్యతలు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. మొత్తం ఈ కమిటీలో 21 మందికి చోటు కల్పించారు.... మీడియా సమన్వయ కమిటీ ఛైర్మన్ గా ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి, కన్వినర్ గా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ను ప్రకటించింది. ఎన్నికల కమిటీలను అధిష్టానం ప్రకటించిన నేపథ్యోం రానున్న ఎన్నికలకు సమాయత్తం కావలసిన బాధ్యత టీపీసీసీపై పడింది. అధిష్టానం స్పీడ్ చూస్తుంటే ఫిబ్రవరిలోనే లోక్ సభ అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు భర్తీ కావడంతో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.

Related Posts