YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వాట్స్ అప్ లకు బానిసలు కావద్దు

వాట్స్ అప్ లకు బానిసలు కావద్దు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరంలోనే ప్రత్యేకంగా మహిళ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసిఆర్  ఆలోచిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి పేర్కొన్నారు. విద్యారంగంలో ఆడపిల్లలు దూసుకుపోతున్నటట్లు ప్రశంసించారు. విద్యాప్రమాణాలను పెంచుకునేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానకి ఆధునిక, సాంకేతిక పరిజ్ఙనాన్ని వినియోగించుకోవాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లను  విద్యాపరమైన అంశాలకు మాత్రమే  పరిమితం చేసుకోవాలని ఉద్బోదించారు. వాట్స్ అప్ లకు బానిసలు కావద్దని చెప్పారు. వడ్డెపల్లి పింగిళ్  ప్రభుత్వ మహిళ కళాశాలలో రూసా నిధులతో నిర్మించిన ఆడిటోరియంను స్థానిక శాసన సభ్యుడు ధాస్యం వినయ్ భాస్కర్ తో కలసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాస్యం వినయ్ భాస్కర్ ఆద్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్ధినీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాధమిక స్ధాయి నుండి పిజి స్ధాయి వరకు ప్రభుత్వ విద్యాసంస్థలను పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం  2 వేల కోట్లను ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. కార్పరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు అభివృద్ది చేందుతు న్నట్లు తెలిపారు. ఒక కోటి రూపాయల వ్యయంతో ఈ ఆడిటోరియంను అదనంగా నిర్మించుకున్నామని తెలిపారు. అదనపు తరగతి గదులు, లైబ్రరీ గదులు, సైన్స్ ల్యాబ్, క్రీడా సదుపాయాలు,పాతభవనముల మరమత్తులు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి పాలనతో నిర్వీర్యమైన విద్యా,వైద్య రంగాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు స్థానిక శాసన సభ్యుడు  ద్యాసం వినయ్ భాస్కర్ తెలిపారు. విద్యా,వైద్యం పౌరుల ప్రాధమిక హక్కులని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో వరంగల్ లోని ప్రభుత్వవిద్యాసంస్థలలో కోట్లాది రూపాయంలో వ్యయంతో  మౌళిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రామాణిక విద్యకు, విలువలతో కూడిన విద్యకు కేంద్రాలుగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చేవిధంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థీనీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్వప్న, ఉన్నత విద్యాశాఖ ఆర్ జెడి ధర్జన్, విద్యాశాఖ ఇఇయండి. షఫి, ప్రిన్సిపాల్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.  

Related Posts