Highlights
- రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ లేఖ
- 23న విభజన హామీలపై భేటీ
- తెలంగాణ అధికారులకూ ఆహ్వానం
విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరిందింది. ఈ మేరకు రాష్ట్ర విభజన హామీలపై చర్చించేందుకు ఏపీ నుంచి సంబంధిత ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్‌కు కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ తెలంగాణ అధికారులనూ పంపించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం హోం శాఖ సమాచారం అందించింది.కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన విభజన హామీలపై ఈ నెల 23న సాయంత్రం 4 గంటలకు సమావేశానికి రావాలని లేఖలో పేర్కొన్నారు. విశాఖకు రైల్వే జోన్, రాష్టంలోని ఆర్థిక, రెవెన్యూ లోటు, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్టు, విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజన అంశాలైపె ఈ నెల 23న సుదీర్ఘంగా కేంద్రం చర్చించనుంది. ఈ చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో, కేంద్రం ఎంతవరకు ఆ సమస్యలను పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.