YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

10 శాతం రిజర్వేషన్లఫై సుప్రీంకోర్టు విచారణ కేంద్ర ప్రభుత్వానికి నోటిసులు జారి

10 శాతం రిజర్వేషన్లఫై సుప్రీంకోర్టు విచారణ              కేంద్ర ప్రభుత్వానికి నోటిసులు జారి
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టడాన్ని సవాల్ చేస్తూ జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షలు ఆర్.కృష్ణయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిగింది.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తరుణ్ గోగాయ్ జడ్జీలు విచారణ చేపట్టారు. పిటిషన్ పై అడ్వకేట్ల వాదోపవాదాల తర్వాత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంకు నోటిసులు జారి చేశారు. ఈ నెల 26 న జరిగే కేసు విచారణ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం తన వాధనలు వినిపించాలని కోరారు.అగ్రకులాల్లోని పేదలకు 10 రిజర్వేషన్లు పెట్టడం రాజ్యాంగ విరుద్దమని కృష్ణయ్య తరుపున సుప్రీంకోర్టు లో సీనియర్ అడ్వకేటు సుబ్బారావు వాదించారు. సామాజిక వెనుకబాటుతనం, విద్యా రంగంలో వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్లు పెట్టాలని  రాజ్యాంగం లో ఉంది.  ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా “ఆర్ధిక వెనుకబాటు తనo” ఆధారంగా రిజర్వేషన్లు పెట్టాలనే కొత్త ప్రతిపాదిక పై పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించిరాజ్యాంగంలోని ఆర్టికల్ 15(6) -16(6) చేర్చారు. పైగా రాజ్యాంగ మౌళిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్ కు లేదు. గతంలో సుప్రీంకోర్టు 13 మంది జడ్జీలు గల రాజ్యాంగ ధర్మాసనం కేశావనంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసులో తీర్పు చేసింది. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌళిక సూత్రాలకు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్దంగా ఉంది. రాజ్యాంగంలోని మౌళిక సూత్రాలకు విరుద్దంగా, సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉంది. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ప్రయోజనాలకోసం రాజ్యాంగాన్ని సవరించారన్నారు పైగా సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్ పరిధిని దాటిoదన్నారు. ఇది న్యాయ సమీక్ష చేయవలిసిన కేసు అన్నారు.  అందుకే ఈ కేసును విస్త్రుత స్థాయిలో విచారణ జరిపి ఈ రిజర్వేషన్లు చెల్లవని కోర్టు కొట్టివేయాలని కోరారు.

Related Posts