YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

యుద్ధభూమిలోకి దిగండి.... గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ట్వీట్స్

 యుద్ధభూమిలోకి దిగండి.... గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ట్వీట్స్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఘాటుగా స్పందించారు. ఇక మాటల్లేవని యుద్ధమేనంటూ ట్వీట్ చేశారు. గంభీర్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఈ దాడిపై స్పందించారు. జవాన్ల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే గంభీర్ స్పందించారు. ఎకనామిక్ టైమ్స్ కథనాన్ని ట్వీట్ చేస్తూ.. ‘అవును, వేర్పాటువాదులతో మాట్లాడాలి. అవును, పాకిస్థాన్‌తో చర్చించాలి. కానీ ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడటం కాదు. యుద్ధ భూమిలోకి దిగి సమాధానం చెప్పే సమయం వచ్చింది. జరిగింది చాలు. శ్రీనగర్-జమ్మూ హైవేలో జరిగిన దాడిలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు’ అని గంభీర్ పేర్కొన్నారు. గంభీర్ ట్వీట్ చేసే సమయానికి 18 మంది జవాన్లు అమరులైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 44కు చేరినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ దాడిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘జమ్మూకశ్మీర్‌లో మన సీఆర్పీఎఫ్‌పై జరిగిన ఉగ్రదాడిలో మన వీరులు అమరులవడం చాలా బాధించింది. ఈ బాధను వర్ణించడానకి మాటలు సరిపోవు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. సురేష్ రైనా స్పందిస్తూ.. ‘కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అమరవీరుల కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఉగ్రదాడి తమను ఎంతగానో బాధించిందని, గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ధావన్, కోహ్లీ ట్వీట్లు చేశారు.

Related Posts