YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దాడికి పాల్పడ్డవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం: ప్రధాని మోదీ

 దాడికి పాల్పడ్డవారిని  ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం: ప్రధాని మోదీ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పుల్వామా ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దాడికి పాల్పడ్డవారిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలోని యవత్మాల్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ.. తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి తగిన బుద్ధి చెబుతాం. భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పుల్వామాలో జవాన్ల మృతి కారణంగా అందరూ చాలా బాధలో ఉన్నారని నాకు తెలుసు. మీ ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. జవాన్లలోనూ ఆగ్రహం ఉంది. ముఖ్యంగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లలో. వారి ఆగ్రహాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు జవాన్లు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాదు’ అని వ్యాఖ్యానించారు.మహారాష్ట్ర పర్యటన సందర్భంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి పథకాలను వివరించి చెప్పారు. ‘దేశంలోని ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. యవత్మాల్‌లో అనేక ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. పేద ప్రజలకు ఇవి చాలా ఉపయోగపడతాయి. సామాజిక భద్రతను కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గిరిజనుల సంక్షేమానికి ప్రాధ్యానతనిస్తున్నాము. నేను చేస్తున్న ప్రయత్నాల పట్ల మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Related Posts